యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా రూపొందుతున్న లేటెస్ట్ సినిమా సాహో. టాలీవుడ్ తో పాటు పలు ఇతర భాషల్లో కూడా భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇకపోతే ఇటీవల ఈ సినిమా టీజర్, వీడియో ప్రోమో సాంగ్స్ మరియు ట్రైలర్ యూట్యూబ్ లో విడుదలైన తరువాత సినిమాపై అంచనాలు ఆకాశమే హద్దుగా పెరిగిపోయాయి. ఇకపోతే ఈనెల 30వ తేదీన అత్యంత భారీ స్థాయిలో అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న సాహో సినిమా బిజినెస్ కూడా కళ్ళు చెదిరే రేంజ్ లో జరిగినట్లు సమాచారం అందుతుంది. 

ఇక నేడు కొందరు సినీ ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్న లెక్కల ప్రకారం, ఈ సినిమా థియేట్రికల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్, డిజిటల్ రైట్స్ వంటివి అన్ని కలుపుకుని ఇప్పటివరకు దాదాపుగా రూ.320 కోట్లవరకు రాబట్టినట్లు సమాచారం. ఇక ఈ సినిమాకు పెట్టిన రూ.350 కోట్లలో దీనిప్రకారం, ఆల్మోస్ట్ పెట్టిన బడ్జెట్ మొత్తం నిర్మాతలకు వచేసినట్లే అని, అయితే హీరో ప్రభాస్ మరియు నిర్మాతలు వంశీ, ప్రమోద్, తమ సినిమాను అమ్మిన కొన్ని చోట్ల లాభాల్లో వాటాలు వచ్చేలా కూడా ఒప్పందం చేసుకున్నారట. దీన్నిబట్టి సాహో ఏ మాత్రం హిట్ టాక్ సాధించినా సరే, వచ్చే కలెక్షన్ల తుఫాన్ కు అడ్డుకట్ట పడేలా కనపడడం లేదంటున్నారు. ఒకవేళ అదే జరిగితే, నిర్మాతలకు విపరీతమైన లాభాల రూపంలో కాసుల పంట పండినట్లే అని అంటున్నారు విశ్లేషకులు. 

అయితే ఈ సినిమా బిజినెస్ విషయమై ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో నిజానిజాలపై ఇంకా సాహో టీమ్ నుండి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, దాదాపుగా సాహోకు ఆ రేంజ్ లోనే బిజినెస్ జరిగినట్లు కొందరు టాలీవుడ్ ప్రముఖులు కూడా అంటున్నారట. మరి ఇదే కనుక నిజం అయితే, అప్పుడే దాదాపుగా మొత్తం బడ్జెట్ ను రాబట్టిన సాహో, రేపు రిలీజ్ అయి సూపర్ హిట్ సాధిస్తే, అటు ప్రభాస్ తో పాటు సినిమా యూనిట్ కు, మరియు సినిమాను కొన్న బయ్యర్లకు డబ్బు తో పాటు పేరు కూడా మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి....!!


మరింత సమాచారం తెలుసుకోండి: