ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టించిన సాహో సినిమా ఫీవ‌ర్ స్టార్ట్ అయ్యింది. ప్ర‌తి ఒక్క ఇండియ‌న్ సినిమా ల‌వ‌ర్ సాహో ఎప్పుడు థియేట‌ర్ల‌లోకి దిగుతుందా ? అని ఎంతో ఎగ్జైట్‌మెంట్‌తో వెయిట్ చేస్తున్నాడు. బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ మ‌రోసారి దేశ‌వ్యాప్తంగా వార్త‌ల్లో నిలుస్తున్నాడు. రూ.350 కోట్ల భారీ బ‌డ్జెట్ (ప్ర‌భాస్ చెప్పిన లెక్క‌ల ప్ర‌కారం) తో తెర‌కెక్కిన ఈ సినిమాకు కేవ‌లం ఒక్క సినిమాను డైరెక్ట్ చేసిన అనుభ‌వం మాత్ర‌మే ఉన్న సుజీత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే.


యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌భాస్‌కు అత్యంత స‌న్నిహితులు అయిన ప్ర‌మోద్ - వంశీ ఈ సినిమాను నిర్మించ‌గా బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్ర‌ద్ధాక‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. రూ. 350 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌లోనే అంత మొత్తాన్ని వెనక్కి రాబట్టే అవకాశం ఉందంటున్నాయి సినీ వర్గాలు. ప్ర‌స్తుతం సాహో బిజినెస్ ఇండియ‌న్ సినిమా ట్రేడ్ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.


సాహో వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.330 కోట్ల‌కు పైగా ప్రి రిలీజ్ బిజినెస్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఏపీ + తెలంగాణ‌లోనే సాహో సినిమా థియేట్రికల్ రైట్స్‌ రూ.125 కోట్లు పలికాయట. దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలు రూ. 46 కోట్లు -  హిందీ వర్షన్‌ రూ.120 కోట్లకు - ఓవర్‌సీస్‌ లెక్కలు రూ.42 కోట్లుగా తెలుస్తోంది. ఇవి కాక శాటిలైట్‌, డిజిటల్‌, ఆడియో రైట్స్ ఆదాయం స‌రేస‌రి. మ‌రి ఈ భారీ టార్గెట్‌ను ప్ర‌భాస్ ఎలా చేధిస్తాడో ?  చూడాలి.


సాహోలో నీల్‌ నితిన్‌ ముఖేష్‌, జాకీ ష్రాఫ్‌, చుంకీ పాండే, మందిరా బేడీ, మురళీ శర్మ, మహేష్‌ మంజ్రేకర్‌, వెన్నల కిశోర్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఒక్కో పాటకు ఒక్కో సంగీత దర్శకుడు సంగీతమందిస్తుండగా జిబ్రాన్‌ నేపథ్య సంగీతమందిస్తున్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: