దాదాపు 350 కోట్ల బడ్జెట్ తో యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న చిత్రం సాహో. బాహుబలి, బాహుబలి2 సినిమాల తరువాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావటం, ట్రైలర్ హాలీవుడ్ సినిమాను తలపించేలా ఉండటంతో సాహో సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డ్ స్థాయిలో జరిగింది. కొన్ని ఏరియాలలో బాహుబలి2 కంటే సాహో సినిమా ఎక్కువ రేటుకు అమ్మడయినట్లు సమాచారం. 
 
సాహో సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే నైజాం ఏరియాలో ఈ సినిమాను 40 కోట్ల రుపాయలకు అమ్మినట్లు సమాచారం. సీడెడ్ 25 కోట్ల రుపాయలకు, నెల్లూర్ జిల్లా 5 కోట్ల రుపాయలకు, గుంటూర్ జిల్లా 12 కోట్ల రుపాయలకు, కృష్ణా జిల్లా 8 కోట్ల రుపాయలకు, ఉభయ గోదావరి జిల్లాలు 19 కోట్ల రుపాయలకు, వైజాగ్ 16 కోట్ల రుపాయలకు అమ్మినట్లు సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాల్లో సాహో సినిమా 125 కోట్ల రుపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 
 
సాహో సినిమా బాలీవుడ్ హక్కులు 120 కోట్ల రుపాయలకు అమ్మినట్లు తెలుస్తోంది. సాహో ఓవర్సీస్ హక్కులు 42 కోట్ల రుపాయలకు, కర్ణాటక హక్కులు 27 కోట్ల రుపాయలకు, కేరళ, తమిళనాడు హక్కులు 19 కోట్ల రుపాయలకు అమ్మినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సాహో సినిమా 333 కోట్ల రుపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. సాహో సినిమా హిట్ అవ్వాలంటే కనీసం 400 కోట్ల రుపాయల షేర్ వసూలు చేయాల్సి ఉంది. 
 
సాహో శాటిలైట్, డిజిటల్ రైట్స్ విషయానికి వస్తే సన్ నెట్ వర్క్ సాహో సినిమా హక్కులు తెలుగు,తమిళం, మలయాళం భాషలకు 60 కోట్ల రుపాయలకు తీసుకున్నారు. హిందీ శాటిలైట్, డిజిటల్ రైట్స్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. దాదాపు పది వేల థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా సాహో సినిమాను నిర్మాతలు విడుదల చేయబోతున్నారు. ప్రభాస్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ శ్రధ్ధా కపూర్ నటిస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: