టాలీవుడ్ కి కర్మ అనే సినిమా ద్వారా పూర్తి స్థాయి నటుడిగా ఎంట్రీ ఇచ్చిన అడివి శేష్, అంతకముందు శ్రీను వైట్ల, ఆర్యన్ రాజేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన సొంతం అనే సినిమాలో చిన్న క్యామియో పాత్రలో నటించడం జరిగింది. మొదట్లో కెరీర్ పరంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొన్న శేష్, ఆ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన పంజా సినిమాలో ఆయన పోషించిన మున్నా పాత్రతో ప్రేక్షకుల నుండి నటుడిగా మంచి పేరు సంపాదించారు. ఆపై బలుపు, రన్ రాజా రన్, బాహుబలి, దొంగాట వంటి సినిమాల్లోని ఆయన పాత్రలకు మంచి గుర్తింపు లభించడంతో శేష్, టాలీవుడ్ లో తనకంటూ కొంత ప్రత్యేక గుర్తింపు లభించాలని భావించి, 

అనంతరం పివిపి బ్యానర్ లో తెరకెక్కిన క్షణం సినిమాలో తాను హీరోగా నటించడంతో పాటు, రచయితగా కూడా పని చేసారు శేష్. అప్పట్లో చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని అందుకున్న క్షణం తరువాత, శేష్ కు మరింత గుర్తింపు లభించింది. అయితే అదే ఊపుతో ఆయన గూఢచారి అనే సినిమా చేసారు, అది కూడా సూపర్ సక్సెస్ ని సాధించడంతో ప్రస్తుతం ఆయన గూఢచారి 2, మేజర్, ఎవరు అనే మూడు వైవిధ్యమైన కథాంశాలతో రూపొందుతున్న సినిమాల్లో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఆయన నటిస్తున్న ఎవరు సినిమా టీజర్ మరియు ట్రైలర్ ఇప్పటికే యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ మరియు లైక్స్ తో దూసుకెల్తూ, సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసింది. కొత్త దర్శకుడు వెంకట్ రాంజీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కూడా నటనతో పాటు రచయితగా పని చేస్తున్న శేష్, రేపు థియేటర్ కు వచ్చే ప్రేక్షకుడికి ఎంతో థ్రిల్ నిచ్చేలా తమ సినిమా ఉంటుందని, నిన్న జరిగిన ఈ సినిమా ప్రెస్ మీట్ లో పాల్గొంటూ చెప్పారు. నిజానికి తమ సినిమాకు మొదట ప్రి రిలీజ్ ఈవెంట్ చేద్దాం అని భావించినప్పటికీ, 

సినిమాపై ఉన్న నమ్మకంతో ప్రీమియర్ షోను నేటి సాయంత్రం ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు శేష్. అయితే ఈ సినిమాకు సంబంధించి నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, రేపు రిలీజ్ కానున్న ఈ సినిమా, నిజంగా థియేటర్ కు వచ్చే ప్రేక్షకుడికి మంచి కిక్ ని ఇవ్వడం ఖాయమని, ఇక అక్కడక్కడా మధ్యలో వచ్చే ట్విస్టులు, అలానే క్లైమాక్స్ లో వచ్చే అతి పెద్ద ట్విస్ట్ తో ప్రేక్షకుడికి అద్భుతమైన అనుభూతినిచ్చేలా యూనిట్ ఈ సినిమాను రూపొందించిందట. ఇక టాలీవుడ్ లో ఈ సినిమాపై మంచి పాజిటివ్ వైబ్స్ ఉన్న కారణంగా, సినిమాకు ఏ మాత్రం మంచి టాక్ వచ్చినా, కలెక్షన్స్ అదరగొట్టే రీతిలో వస్తాయని, అలానే ఈ సినిమా తరువాత శేష్ మరింత పేరు సంపాదించడం ఖాయమని అంటున్నారు సినిమా విశ్లేషకులు. మరి రేపు రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఎంతవరకు విజయాన్ని అందుకుంటుందో వేచి చూద్దాం.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: