మెగాస్టార్ టైమ్ మిషన్ లో వెనక్కి వెళ్లొచ్చాడా? కింగ్ నాగార్జున ఏదైనా అమృతం తాగాడా? ఈ ఇద్దరు స్టార్స్ ఒక్కసారిగా 30ఏళ్లు వెనక్కి వెళ్లిపోయారు. ఈ స్టార్స్ లేటెస్ట్ లుక్ టీటౌన్ సర్కిల్స్ లో హాట్ టాపిక్. మెగాస్టార్, కింగ్ నాగార్జున ఇద్దరు ఫ్యాన్స్ ను ఫిదా చేస్తున్నారు. 

ఈ నెల 22తో మెగాస్టార్ చిరంజీవి 63ఏళ్లు పూర్తి చేసుకొని 64లోకి అడుగు పెడతాడు. ఇక నాగార్జున ఈ నెల 29తో 60ఏళ్ల వయసులోకి వచ్చేస్తాడు. కానీ ప్రస్తుతం ఈ ఇద్దరి లుక్స్ ని చూస్తుంటే ఓ ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లినట్టు కనిపిస్తున్నారు. మన్మథుడు 2లో నాగార్జున నవ మన్మథుడిలా స్లిమ్ అండ్ ట్రిల్ లుక్ తో యంగ్ హీరోలను మైమరిపించాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి న్యూలుక్ గురించి టాలీవుడ్ లో పెద్ద  చర్చ నడుస్తూనే ఉంది. అంతేకాదు మెగా అభిమానులు సైతం ఆ కొత్త గెటప్ గురించి ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. 

64 ప్లస్ ఏజ్ లోనూ చిరు అంత స్టైలిష్ గా అంత యంగ్ గా మారాడు. ఆయనేమైనా అమృతం తాగారా? ఈ ఏజ్ లో ఆ లుక్ ఏంటి అంటూ మెగాస్టార్ లుక్ హాట్ టాపిక్ అయింది. మెగాస్టార్ లుక్ వెనుక ఓ సీక్రెట్ ఉందట. కోడలు ఉపాసన బీ పాజిటివ్ మ్యాగజైన్ కవర్ పైనా మెగాస్టార్ లుక్ చూసి అంతా షాక్ తిన్నారు. మొన్న ఎస్పీబీ సారథ్యంలో మ్యూజిక్ అవార్డ్స్ వేడుకల్లో చిరంజీవి లుక్ చూశాక అభిమానులు మంత్ర ముగ్దులయ్యారు. అయితే ఈ సరికొత్త లుక్ కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న 152వ చిత్రం కోసమే అని తెలుస్తోంది. కేరళ ఆయుర్వేదిక్ పుడ్ తోనే చిరు ఇలా యంగ్ గా మారారని సమాచారం. మొత్తానికి కొరటాల శివ సినిమాలో లుక్ పరంగా కొత్త చిరంజీవిని చూడబోతున్నారనేది చెప్పకనే చెప్పేశారు.  








మరింత సమాచారం తెలుసుకోండి: