ప్రభాస్ సాహో మూవీకి సంబంధించిన న్యూస్ ఒక్కొక్కటిగా బయటకు వస్తోంది.  ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు.  ఆగష్టు 15 వ తేదీన సాహో గేమ్ ను రిలీజ్ చేయబోతున్నారు.  దేశంలోని ప్రముఖ నగరాల్లో దీని ప్రమోషన్ ఉండబోతుంది.  అటు దుబాయ్ లో కూడా భారీ ప్రమోషన్ చేయబోతున్నారు.  ప్రపంచ వ్యాప్తంగా సినిమాకు క్రేజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది యూనిట్.  


ఇదిలా ఉంటె, ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ విషయాలు బయటకు వచ్చాయి.  దాదాపు రూ. 320 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిసినెస్ జరిగినట్టు తెలుస్తోంది.  తెలుగు రాష్ట్రాల్లో రూ. 120 కోట్ల రూపాయల బిజినెస్ జరిగినట్టు సమాచారం.  ఇక దేశవ్యాప్తంగా చూసుకుంటే.. దాదాపుగా రూ. 291 కోట్ల బిజినెస్ జరిగింది. ఓవర్సీస్ తో కలిపి మొత్తంగా రూ. 320 కోట్ల రూపాయల బిజినెస్ జరిగినట్టు సమాచారం.  


ఒకరకంగా చెప్పాలి అంటే ఇది భారీ బిజినెస్.  అయితే, ఈ సినిమా కోసం దాదాపుగా రూ. 350 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని తెలుస్తోంది.  అంటే, కనీసం ఇంకా రూ. 30 కోట్ల బిజినెస్ జరగాలి.  ఇది శాటిలైట్ రూపంలో, డిజిటల్ రూపంలో వచ్చేస్తుంది అనడంలో సందేహం అవసరం లేదు.  డిస్ట్రిబ్యూటర్లు లాభాల బాటలో నడవాలంటే సాహో కనీసం రూ. 400 కోట్ల రూపాయలు వసూళ్లు చేయాలి.  అపుడే లాభాల్లో నడుస్తుంది.  


సినిమా బాగుంది అంటే టాక్ వస్తే ఇదేమంత పెద్ద విషయం కాదు.  కాకపోతే.. సినిమా ఎలా ఉంటుంది అన్నది డౌట్.  తెలుగు సినిమాల్లో కనీసం 6 పాటలు ఉండాలి.  ఇందులో మూడే ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రెండు రిలీజ్ చేశారు.  ఆ రెండు కూడా సో సో గా ఉన్నాయి.  విజువల్ పరంగా వండర్ అని చెప్పొచ్చు.  సినిమాలో 80శాతం యాక్షన్ ఉంటుంది.  మిగతా 20శాతం మాత్రమే లవ్, సెంటిమెంట్, కామెడీ వగైరా ఉండొచ్చు. 


పైగా ఈ సినిమా 8 నిమిషాల తక్కువగా మూడు గంటల నిడివి ఉండటంతో అంతసేపు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుందా చూడాలి.  బిజినెస్ పరంగా బాగుంది. ఫస్ డే వసూళ్లు ఎలా ఉంటాయి.. వీకెండ్ లో వసూళ్లు ఎలా ఉంటాయి అనే విషయం తెలియాలంటే ఆగష్టు 30 వరకు ఆగాల్సిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: