ఇండియా టాప్ సెలబ్రిటీ అంటే ఖాన్ హీరోల్లో ఎవరో ఒకరిని చెబుతారు. ఇక అన్ని రంగాల్లో.. ప్రధాన మంత్రి మోడీ అని కొందరు.. ముఖేష్ అంబానీ అని ఇంకొందరు చెబుతారు. ఈ సెలబ్రెటీ  అందరినీ దాటేసి ఇండియన్ టాప్ సెలబ్రిటీగా నిలిచింది. ఆమె ఎవరో కాదు సన్నీలియోన్. 

సన్నీలియోన్ పట్టుమని 10 సినిమాల్లో హీరోయిన్ గా నటించలేదు. అపుడపుడు ఐటం సాంగ్స్ లో కనిపిస్తుంది. ఆడియన్స్ కు రెగ్యులర్ గా టచ్ లో ఉండదు. అదే మహాప్రసాదంగా భావిస్తారు యూత్. ఇటీవల అయితే సన్నీలియోన్ స్పెషల్ సాంగ్స్ తగ్గిపోయాయనే చెప్పొచ్చు. కానీ ఆమెకు ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. అంచెలంచెలుగా పాపులారిటీ పెంచుకుంటూ పోతోంది. అది ఎంతలా అంటే మహామహులను సైతం దాటుకొని దూసుకొని వెళ్లిపోతోంది. ఇటీవల గూగుల్ ఓ సర్వే నిర్వహించింది. నెటిజన్లు గూగుల్ లో ఎక్కువ శాతం ఎవరి గురించి సెర్చ్ చేస్తున్నారో.. ఓ నివేదిక తయారు చేసింది. అందులో మొదటి స్థానం సంపాదించుకున్న సన్నీలియోన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తోంది.

సాధారణంగా బాలీవుడ్ ఖాన్ హీరోలకు క్రేజ్ ఎక్కువ. సౌత్ లోకి వస్తే.. రజనీకాంత్.. చిరంజీవి.. పవన్ కల్యాణ్ కు అభిమానులు లక్షల్లో ఉన్నారు. ఇక పొలిటికల్ సెలబ్రిటీ మోడీని సన్నీలియోన్ దాటేసింది. గతేడాది గూగుల్లో సన్నీని ఎక్కువ మంది సెర్చ్ చేశారు. ఈ విషయంలో ఈ ఏడాది కూడా సన్నీ నెంబర్ వన్ అనిపించుకుంది. గూగుల్ ట్రెండ్ అనలైటిక్స్ లో సన్నీలియోన్ దూసుకుపోతోంది. నెట్ లో సన్నీలియోన్ వీడియోను ఎక్కువమంది సెర్చ్ చేస్తున్నారు. ముఖ్యమంగా ఈశాన్య భారతం నెటిజన్లు సన్నీగురించి తెలుసుకోవడంలో ఆసక్తి చూపిస్తున్నారు. వరుసగా రెండేళ్లు గూగుల్లో టాప్ సెలబ్రెటీగా సత్తాచాటడం ఈ బోల్డ్ బ్యూటీకే సాధ్యమైంది.  





మరింత సమాచారం తెలుసుకోండి: