ప్రముఖ కోలీవుడ్ హీరో విజయ్ కి అక్కడ ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే.  సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత విజయ్, అజిత్ కి మాస్ ఇమేజ్ బాగా వచ్చింది.  ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఈ ఇద్దరి హీరోలకు బాగా ఉంది.  ఈ ఇద్దరు హీరోలు నటిస్తున్న సినిమాలు కూడా తమిళ నాట వరుసగా విజయాలు సాధిస్తున్నాయి.  అయితే విజయ్ నటించిన ప్రతి సినిమా తెలుగులో డబ్ చేస్తుంటారు.  ఇక్కడ కూడా విజయ్ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది.  
వెండి తెరపై హీరోయిజమే కాదు బయట కూడా విజయ్ తన మంచి తనంతో ఎంతో మంది మనసు గెలుచుకుంటున్నారు. 

ఎక్కడ ఏ విపత్కర పరిస్థితులు వచ్చినా నేనున్నా అంటూ తన వంతు సహాయం చేస్తుంటాడు.  ఇక ఫ్యాన్స్ కి అందుబాటు లో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటారు.  మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ‘సర్కార్’ ఎన్ని ఆంక్షాలు, విమర్శలు వచ్చినా భారీ హిట్ సాధించి కలెక్షన్ల పంట పండింది.  గతంలో కూడా మెర్సల్ సినిమా విషయంలో కూడా విజయ్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.  ఆ మద్య విజయ్ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నాడని సోషల్ మీడియాలో తెగ వార్తలు వచ్చాయి. 

ప్రస్తుతం తన కెరీర్ పై దృష్టి ఉందని..జనం పిలిస్తే రాజకీయాల్లోకి వస్తానని ఓ సందర్భంలో విజయ్ అన్నారు.  తాజాగా అట్లి దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న  `బిగిల్` షూటింగ్ పూర్తయ్యింది.  ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులను మర్చిపోలేని విధంగా సత్కరించాడట. తనకు షూటింగ్ సమయంలో ఎంతో సహాయంగా ఉన్న అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ..400 బంగారు ఉంగరాలు బహుమతిగా ఇచ్చాడట. అంతే కాదు విజయ్, అట్లీ సంతకాలతో కూడా ఫుడ్ బాల్స్ కి చిత్ర యూనిట్ కి బహుకరించారట.  సినిమా ఫుట్‌బాల్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కావడంతో అట్లీ, విజయ్ ఇలా యూనిట్ సభ్యులందరికీ తమ ఆటోగ్రాఫ్‌లతో కూడిన బంతులను అందించారట.


మరింత సమాచారం తెలుసుకోండి: