తేజ దర్శకత్వంలో కళ్యాన్ రామ్ నటించిన ‘లక్ష్మీకళ్యాణం’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది కాజల్ అగర్వాల్.  లక్ష్మీకళ్యాణం ఫ్లాప్ అయినా కాజల్ నటనకు పేరొచ్చింది. తరవాత టాప్ హీరోయిన్ గా మారాక తన మొదటి దర్శకుడు తేజ అడిగాడని నేనె రాజు నేనె మంత్రి సినిమాలో రానాకి జోడిగా నటించింది. కాజల్ చిత్ర పరిశ్రమలోకి వచ్చి రెండు దశాబ్దాలు అవుతున్నా ఇప్పటికీ కొత్త హీరోయిన్లకు పోటీగా నిలుస్తూ స్టార్ హీరోలు మాత్రమే కాదు అప్ కమింగ్ హిరోలతో కూడా నటిస్తుంది. 


మెగాస్టార్ ఫ్యామిలీ హీరోలు చిరంజీవి,పవన్ కళ్యాన్,రాంచరణ్, అల్లు అర్జున్ వీరందరితో నటించిన ఏకైక హీరోయిన్ కాజల్.  తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలందరి సరసన నటించిన ఈ కలువకళ్ల సుందరి బాలీవుడ్ లో కూడా నటించింది. కానీ అక్కడ పెద్దగా సక్సెస్ కాకపోవడంతో తెలుగు, తమిళ సినిమాలపైనే ఫోకస్ పెట్టింది.  ప్రస్తుతం కాజల్ స్టార్ ప్రొడ్యూసర్ శంకర్, విశ్వనటుడు కమల్ హాసన్ కాంబినేషన్ లో వస్తున్న ‘భారతీయుడు 2’ సినిమాలో నటిస్తుంది. అయితే ఈ మూవీ నుంచి కాజల్ తప్పుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తి కావాల్సి ఉన్నా ఎన్నో అవాంతరాలు చుట్టుముడుతూనే ఉన్నాయి.


మొదట బడ్జెట్ ఎక్కువైందని, దానిపై శంకర్ కి ఆక్షలు పెట్టారని ఆవిషయంలో శంకర్ అసహనానికి గురికావడంతో షూటింగ్ ఆగిపోయిందన్నారు.  తర్వాత శంకర్, నిర్మాణ సంస్థకు ఒప్పందాలు కుదిరాయని..తిరిగి పట్టాలేక్కిందని వార్తలు వచ్చాయి.  ఆ తర్వాత కమల్ హాసన్ ఎన్నికలు రావడంతో షూటింగ్ గ్యాప్ ఏర్పడింది..ఇప్పుడు అన్నీ ఓకే అనుకున్నా..కాజల్ తప్పుకుందని వార్తలు వస్తున్నాయి. దీనిపై స్పందించిన కాజల్  `నేను `భారతీయుడు-2` నుంచి తప్పుకున్నట్టు వస్తున్న వార్తలు విన్నాను.


అది నిజం కాదు. ఆ సినిమాలో భాగమవడాన్ని గర్వంగా భావిస్తున్నాను. కమల్, శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఆ సినిమాను నేను వదులుకునే ప్రసక్తే లేద`ని కాజల్ స్పష్టం చేసింది. ఈ సినిమాలో నటించడం తన అదృష్టంగా భావిస్తున్నాని అంటుంది ఈ కలువ కళ్ల సుందరి.

మరింత సమాచారం తెలుసుకోండి: