నయనతార ప్రతిభ కల మంచి నటీమణి. గత 12 ఏళ్ళకు పైగా  సినిమాల్లొ న‌టిస్తూ ఇంకా నాటౌట్ అంటోంది. ఆమె కోలీవుడ్ నే కాదు టాలీవుడ్ ని కూడా క్రేజీగా ఏలిన రోజులు ఉన్నాయి. నయన్ కావాలని టాలీవుడ్ హీరోలు వెయింటింగ్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నయన్ ఉంటే చాలు సినిమా హిట్ అన్న వారూ ఉన్నారు.


అయితే ఇపుడు ఆ రోజులన్నీ గతం అయిపోయాయిట. నయనతారకు మునుపటి క్రేజ్ లేదని కోలీవుడ్ కోడై కూస్తోంది. నయన్ దొరికిన ఆఫర్ ని దొరికినట్లుగా చేసుకుంటూ పోవడం వల్ల వరసగా సినిమాలు ఫట్ అయిపోతున్నాయట. కోలీవుడ్లో రాణీలా ఉండే నయన్ కి అక్కడే దెబ్బ మీద దెబ్బ పడుతోందట. కేవలం డబ్బు కోసం సినిమాలు ఒప్పుకోవడం వల్ల క్వాలిటీ తగ్గిపోయిందని అంటున్నారు.
 
ఇక మరో వైపు నయన్ దర్శకుడు విఘ్నేష్ తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.  ఆ పెళ్ళి తొందరలో  ఇక వీలునన్ని సినిమాలు చేసుకుంటూ పోవాలనుకుంటున్న నయన్ కి ఇపుడు హిట్లు లేక కొత్త కష్టాలు మొదలయ్యాయట. వరసగా ఫ్లాప్స్ పలకరించడంతో నయన్ డీలా పడిపోయిందట. ఆమె కెరీర్ ఒక్కసారిగా గ్రాఫ్ తల్లకిందులు కావడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో పడిందట.


ఇపుడు నయన్ చూపు రెండు సినిమాల మీదనే ఉందిట. తెలుగులో మెగాస్టార్ సరసన నటించిన సైరా మూవీతో పాటు తమిళ్ లో విజయ్ తో నటించిన మరో మూవీ పైన నయన్ గంపెడు ఆశలు పెట్టుకుందిట. ఈ మూవీస్ కనుక హిట్ అయితే తనకు మళ్లీ క్రేజ్ వస్తుందని నయన్ నమ్ముతోంది. మరి ఆ మూవీస్ నయన్ కోరిక తీరుస్తాయా అన్నది చూడాలి. ఏది ఏమైనా నయన్ ఒకప్పటి క్రేజ్ కోసం నానా తంటాలు పడుతోంది మరి.




మరింత సమాచారం తెలుసుకోండి: