అడవిలో ఏ చిన్న పక్షి కనేపడినా మనకు సంబరమే. ఎందుకంటే అది అడవి. చుట్టూ పచ్చని చెట్లు, సెలయేళ్లు, కొండలు, గుట్టలు.. ఇలా ప్రకృతి రమణీయంగా ఉంటుంది కాబట్టి మనం ఎంతో సంబరపడుతూ ఉంటాం. కనపడిని ప్రతి దృశ్యాన్ని అందంగా మన కెమెరాల్లో, మదిలో బంధిస్తాం. అదే విధంగా జంతువులు కనిపిస్తే బాగుండును అనుకుంటూ ఉంటాం కానీ.. నిజంగా ఎదురుపడితే.. వెంటనే మనలో కంగారు తో కూడిన భయం తాలూకూ వణుకు వచ్చేస్తుంది.


 

కానీ గుజరాత్ లో ఓ సింహం ఏకంగా రోడ్డు మీదకు వచ్చి ఓ చిన్న గుంటలో ఉన్న నీరు తాగుతుంటే.. ఈ వింతను ఆ దారిలో వెళుతున్న వాహనదారులు ఆగిపోయి తమ కెమెరాల్లో బంధించారు. మామూలుగా అయితే ఒక్క ఉదుటున బండి అక్కడే పడేసో, పరుగు లంఘించుకునో, బండి రివర్స్ చేసో పారిపోతారు. కానీ.. ఇక్కడ ఈ దృశ్యాన్ని తాపీగా, ఆనందంతో చిత్రీకరించారు. గుజరాత్ లోని ధారీ-ఉనా జాతీయ రహదారి 48 లో ఈ వింత జరిగింది. ఇటివల కురిసిన వర్షాలకు అడవి పచ్చదనంగా మారింది. దీంతో వర్షపు నీరు కూడా ఎక్కువగా చేరింది. దీంతో అడవిలోని ఓ సింహం దాహంతో వచ్చిందో ఏమో.. ఆ జాతీయ రహదారిపై ఉన్న నీటి గుంట వద్దకు వచ్చి తాపీగా నీరు తాగింది. అక్కడ వాహనాలు, మనుషులు ఉన్నా.. ఆ సింహం తన దప్పిక తీర్చుకుని ఎవరికీ ఏ హానీ చేయకుండా అక్కడి నుండి అడవిలోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేసేస్తోంది.


 

ఈ వీడియోను చూసిన జంతు ప్రేమికులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సింహాల రక్షణకు తీసుకుంటున్న చర్యల వల్ల సింహాల వృద్ధి పెరుగుతోందని.. ఇది ఎంతో శుభపరిణామనని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: