ఇప్పటికే విడుదల అయిన  సాహో ట్రెయిలర్ దాని హైప్‌కు సరితూగెలాగా ఉంది . ఈ ట్రైలర్ లాంచ్‌లో మీడియా, అభిమానులు చాలా మంది హాజరయ్యారు,  ఈ ట్రైలర్‌కు ముంబైలో మంచి ఆదరణ లభించింది. నాలుగు భాషల్లో విడుదలైన ఈ ట్రైలర్ కేవలం 48 గంటల్లో 70 మిలియన్లను దాటగలిగింది. ట్రైలర్ లాంచ్ తరువాత, ప్రభాస్  హైదరాబాద్ లో‌ ప్రమోషన్ కి వస్తున్నాడు.
.
సాహో నిర్మాతలు ఆగస్టు 18 న సాయంత్రం 5 గంటలకు రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు, ఇది ఇప్పటి వరకు జరిగిన వాటిలో అన్నిటి కన్నా పెద్దది. ఇంత పెద్దగా నిర్వహించబడుతున్న ఈ ఈవెంట్ కి ప్రభాస్ చాలా కీలకం. ఈ కార్యక్రమంలో దాదాపు 100,000 మంది ప్రేక్షకులు ఉంటారు, వీరందరూ  ప్రభాస్ ని కలవడానికి వస్తున్న అతని డైహర్డ్ అభిమానులు. దాదాపు 2 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత ప్రభాస్ తన అభిమానులను  రామోజీ ఫిల్మ్ సిటీ  లో  కలవడం చాలా మందికి ఆసక్తికరంగా ఉంది, ఎందుకంటే బాహుబలి 2 విడుదలైనప్పుడు అతను చివరిసారిగా తన అభిమానులతో ఇలా మాట్లాడాడు.

ఈ కార్యక్రమంలో ప్రభాస్, సినిమా  హీరోయిన్  శ్రద్ధా కపూర్‌ ఇద్దరు  కలిసి హాజరవుతారు. ఈ కార్యక్రమంలో మేకర్స్ ప్రేక్షకులను ఒక చిన్న వీడియో  విడుదల చేస్తారు. దాని ద్వారా సాహో కి సంభందించిన మరికొన్ని ఆశక్తి కలిగే విషయాలు ఫాన్స్ కి తెలుస్తాయి.

అందాల రాశి శ్రద్ధా కపూర్‌,   ప్రభాస్   నటిస్తున్న ఈ సినిమా ని ఒకే సారి హిందీ, తమిళం, తెలుగు భాషల్లో మూడు భాషల్లో ‌విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, మందిరా బేడి, చంకీ పాండే, మహేష్ మంజ్రేకర్, అరుణ్ విజయ్, మురళి శర్మ తదితరులు ఉన్నారు. 'సాహో'ఒక హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్, దీనిని టి-సిరీస్ సమర్పించింది, యువి క్రియేషన్స్ నిర్మించి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది  2019 ఆగస్టు 30 న థియేటర్ల లోకి రానుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: