తళైవా అంటే మనకు ముందుగా గుర్తోచ్చేది సూపర్ స్టార్ రజనీకాంత్  నా దారి రహదారి ఓటే డైలాగ్ తో ఈలలేసి, గోలలు చేసి థియేటర్స్ దద్దరిల్లేలా చేశారుమన రజనీ.ఎప్పటి నుంచో అందరి మనసుల్లో మెదులుతున్న ప్రశ్న ఆయన ఎప్పుడు రాజకీయ రంగ ప్రవేశం చేస్తారా అని అటు సినీ వర్గం మరియు ఇటు రాజకీయ వర్గం ఆశక్తిగా ఎదురుచూస్తోంది.అయితే రజినీ దారి రహదారి లేక  రూట్ మ్యాప్ కమలనాథుల డైరెక్షన్ లో రెడీ అవుతోందా అనే అనుమానాలు వెల్లడవుతున్నాయి. కాళా టైంలో కాస్తకాస్తగా కనిపించిన ఈ డౌట్ దర్బార్ వేళలో తమిళనాట బానే దడదడలాడుతోంది. ఇంతకీ తలైవా ఏం చేయబోతున్నారు. తమిళనాట తలైవా దారెటు అనేది ఇప్పుడు సెన్సేషనల్ టాపిక్ గా మారింది.సింగిల్ గా నా దారి రహదారి అంటారా లేక రూట్ మ్యాప్ కమలానికే వదిలేశారు. ఇక ఉన్నది ఏడాది సమయం ఖచ్చితంగా చెప్పాలంటే ఏడాది కూడా లేదు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు అన్నాడిఎంకె డిఎంకె వ్యూహా లను సిద్ధం చేసుకుంటున్నారు.


అయితే తలైవా కనుక సీన్ లోకి ఎంట్రీ ఇస్తే ఇక ఆలోచించటానికి ఏమీ ఉండదని ఫ్యాన్స్ ఇప్పటికే ధీమాగా చెబుతున్నారు. అయితే దశాబ్దాలుగా పొలిటికల్ ఎంట్రీపై సస్పెన్స్ మెయిన్టెయిన్ చేస్తున్న రజినీకాంత్ ఎట్టకేలకు నేను వస్తున్నాను అని ఆయన వెల్లడించారు.ఆ తర్వాత కమల్ హాసన్ పార్టీ పెట్టేశారు. ఎన్నికల్లో పోటీ చేశారు రజనీకాంత్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ పార్టీ ఎపిసోడ్ మాత్రం ముందు కు సాగ లేదు ఇటు చూస్తే వరుసగా రజనీకాంత్ సినిమాలు తీసేస్తున్నారు అటు చూస్తే అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్నాయి. ఈ నేపథ్యం లో ఈ సారి కూడా రజనీ సైలెంట్ సైడవుతారా అన్న చర్చ సాగుతున్న వేళ ఒక్కసారి గా సీన్ మారిపోయింది. రజనీ పార్టీ పెట్టడం ఖాయమని కాకపోతే అంత బీజేపీ డైరెక్షన్ లో నడుస్తోందా అన్న చర్చ వేడిని రచిస్తోందట. అటు జయలలిత లేరు ఇటు కరుణా నిధి లేరు. డీఎంకే స్టాలిన్ నాయకత్వంలో గట్టి పోటీ ఇచ్చే సత్తాను ప్రదర్శిస్తోంది. అన్నాడిఎంకె పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా ఉంది. దీంతో రజనీకాంత్ సీరియస్ గా ఫోకస్ పెడితే సిఎం కావడం ఖాయమని ఆయన అభిమానులు చెబుతున్నారు. అదే సమయంలో అటు బీజేపీతో రజనీ స్నేహ గీతాలు ఒక్కొక్కటి గా విడుదలవుతున్నాయి.


సార్వత్రిక ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీ ని దేశంలోనే అత్యంత శక్తివంతమైన నేతగా రజనీకాంత్ అభివర్ణించారు. తాజాగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పుస్తకావిష్కరణ సభలో మోదీ అమిత్ షాలను కృష్ణార్జునులతో పోల్చి చేశారు రజనీకాంత్. అలాగే ఆర్టికల్ 370 వంటి రద్దుతో చారిత్రాత్మక నిర్ణయమని ప్రశంసలతో ముంచెత్తారు. దీంతో రజనీకాంత్ పెట్టే పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకోవడం ఖాయమని తమిళ రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైందట. అసలు రజనీకాంత్ సొంత పార్టీ పెట్టడం వృధా అని ఆయన అన్నాడీఎంకే కి సారథ్యం వహించాలన్న డిమాండ్ కూడా కొన్నాళ్ల క్రితం తమిళనాట హల్ చల్ చేసింది. అలా జరిగినా లేక సొంత పార్టీ పెట్టిన బిజెపికి ఇబ్బంది ఉండదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే డీఎంకేకి చెక్ పెట్టడమే కమలనాథుల అస్సలు వ్యూహమని అన్నా డీఎంకే లో చేరి ఆ పార్టీని రజినీ నాయకత్వం వహిస్తే  దాంతో పొత్తు పెట్టుకోవడం సొంత పార్టీ పెడితే ఆ కొత్త దుకాణం తోనే పొత్తు పోలిటిక్స్ చేయడం బీజేపీ స్కెచ్ అని రాజకీయ వర్గాల్లో డిస్కషన్ నడుస్తోందట.రజనీ దర్బార్ లో కమలం వికసించేనా లేక మరో కొత్త పార్టీకీ నాంది పలుకుతోందా అన్న ప్రశ్న తమిళనాట ఉత్కంఠం రేపుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: