ప్రస్థానం సినిమాతో దర్శకుడిగా తన సత్తా చాటిన దేవా కట్టా ఆ తర్వాత ఆటోనగర్ సూర్య అంటూ ఓ సినిమా చేశాడు కాని అది పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. తెలుగులో గ్యాప్ ఇచ్చిన దేవా కట్టా హిందిలో ప్రస్థానం రీమేక్ చేశాడు. సంజయ్ దత్ హీరోగా చేస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఈమధ్య రిలీజై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.


హింది ప్రస్థానం రిలీజ్ తర్వాత తెలుగులో దేవా కట్టా సినిమా చేస్తారని తెలుస్తుంది. మెగా హీరోతో దేవా కట్టా సినిమా ప్లాన్ చేస్తున్నారట. మెగా హీరో సాయి ధరం తేజ్ తో దేవా కట్టా సినిమా ఉంటుందని తెలుస్తుంది. కచ్చితంగా ఈ కాంబినేషన్ మూవీ అంచనాలను పెంచేస్తుంది. రీసెంట్ గా చిత్రలహరి సినిమాతో హిట్ అందుకున్న సాయి తేజ్ ప్రస్తుతం మారుతి డైరక్షన్ లో ప్రతిరోజు పండుగ సినిమా చేస్తున్నాడు.


ఈ మూవీతో పాటుగా మేర్లపాక గాంధి డైరక్షన్ లో సాయి ధరం తేజ్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. అయితే దేవా కట్టా సినిమా ప్రస్తుతం డిస్కషన్స్ లోనే ఉందని అంటున్నారు. వరుసగా 6 సినిమాలు ఫ్లాప్ అవడంతో సాయి ధరం తేజ్ కథల విషయంలో చాలా జాగ్రత్త వహిస్తున్నాడు. 


నెట్ ఫ్లిక్స్ కోసం బాహుబలి వెబ్ సీరీస్ డైరెక్ట్ చేసిన దేవా కట్టా బాలీవుడ్ ప్రస్థానం పూర్తి కాగానే మళ్లీ తెలుగులో వరుస సినిమాలు చేయాలని చూస్తున్నాడు. మంచి టాలెంట్ ఉన్న దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నా సరే దేవా కట్టా సక్సెస్ అవ్వలేకపోయాడు. మరి సాయి ధరం తేజ్ సినిమా అయినా సరే దేవాకు మళ్లీ క్రేజ్ తెచ్చేలా చేస్తుందో లేదో చూడాలి. ఈ సినిమాకు భగవాన్, పుల్లారావు నిర్మిస్తారని తెలుస్తుంది.   


 



మరింత సమాచారం తెలుసుకోండి: