పవన్ కళ్యాణ్ లక్కుతో నా లక్కు ను తెచ్చుకుంటా అంటూ యంగ్ టైగర్ పాకులాడుతున్నాడు. అయినా సరే ఇది వర్కవుట్ కాక ఎన్టీఆర్ చతికల పడుతున్నాడు. అయినా ఎవరి లక్కు వారికే ఉంటుంది కాని ఒకరి లక్కు మరొరికి కూడా లక్కు అవుతుంది అనుకుంటే ఎలా చెప్పండి అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఇన్నాళ్లు పవన్ కు హిట్టిచ్చిన డైరెక్టర్లను వెంటనే పట్టుకుని ఎన్టీఆర్ వారితో సినిమా తీసి హిట్టు కొట్టాలని తెగ ప్రయత్నించాడు. అలాగే పవన్ హీరోయిన్లను పట్టుకుని పవర్ ఫుల్ హిట్టు కొట్టాలని చూస్తున్నాడట ఎన్టీఆర్. గబ్బర్ సింగ్ హిట్ కావడంతో వెంటనే ఎన్టీఆర్ శృతి హాసన్ ను రామయ్యా వస్తావయ్యా లో పెట్టుకున్నాడు, అడ్డంగా బుక్కయ్యాడు. తీన్ మార్ లో త్రిష తో పవన్ జోడి కడితే వెంటనే ఎన్టీఆర్ దమ్ము లో త్రిష ను తీసుకుంటే ఏమయింది, ఫెయిలయింది. ఇక తాజాగా పవన్ ‘అత్తారింటికి దారేది’ సినిమా హిట్టిచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆ సినిమా లోని హీరోయిన్లయిన సమంత, ప్రణీతలను వెంటనే తాను తాజాగా తీస్తున్న ‘రభస’ వారిద్దరితోనే జత కడుతున్నాడు. ఈ సారైనా పవన్ లక్కు ఎన్టీఆర్ కు కలిసి వస్తుందేమో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: