టాలీవుడ్ లో ఉన్న హీరోల్లో అడవి శేష్ మొదట్నుంచి కొత్త పంథాలో వెళుతున్నాడు. అందుకే తన నుండి క్షణం, గూఢాచారి వంటి వినూత్నమైన సినిమాలు వచ్చి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే ప్రస్తుతం మన యంగ్ హీరోస్, హీరోయిన్స్, స్టార్ హీరోస్..డైరెక్టర్స్..ఇలా అందరు బాలీవుడ్..హాలీవుడ్ వుడ్ తో పాటు కొరియన్ సినిమాల ఇన్స్పిరేషన్ తో సినిమాలను తెరకెక్కించి హిట్ కొడితే శేష్ మాత్రం ఆఫీస్ బాయ్ వల్ల కసి పెరిగి సినిమా తీశాడని చెప్పడం ఆసక్తికరమైన విషయం. అందుకే ఆఫీస్ బాయ్ ని దృష్టిలో పెట్టుకొని ప్రతి సినిమాకు కష్టపడి పనిచేస్తాను. ఎవరు సినిమాను ఆ ఆఫీస్ బాయ్ కి అంకితమిస్తున్నానని ప్రకటించాడు.

ఇక "ఇప్పటివరకు ఎవరు సినిమాను ఓ వెయ్యి మందికి చూపించారట. అసలు సినీ పరిశ్రమతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తులు, కాలేజ్ స్టుడెంట్స్, ఐటీ ఉద్యోగులు, వాచ్ మేన్ కుటుంబం.. ఇలాంటి వాళ్లు వెయ్యి మంది చూశారు. నేను, దర్శకుడు కాకుండా అసిస్టెంట్ డైరక్టర్స్ మాత్రమే ఉండి సినిమా చూసిన తర్వాత వాళ్ల అభిప్రాయాల్ని తీసుకున్నారు. అంతేకాదు చిత్ర బృందం వాళ్లను ఎలాంటి ప్రశ్నలు అడగలేదట. వాళ్ళకు వాళ్లుగా వచ్చి చెప్పిన అభిప్రాయాల్ని మాత్రమే తీసుకున్నాం. ఆ ఫీడ్ బ్యాక్ ద్వారా సినిమాను మరింత బెటర్ గా చేశారట." నిజంగా ఇది మెచ్చుకోవాల్సిన విషయం. అంతేకాదు ఇది ఒక కొత్తరకమైన పబ్లిసిటీ కూడా.

రెజీనా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను ఒక రోజు ముందుగానే మీడియాతో పాటు కామన్ ఆడియన్స్ కు చూపించారు. అందుకే ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను రద్దుచేసి, ఆ స్థానంలో ప్రీమియర్ ఏర్పాటుచేశారు. ఈ షో చూసిన ప్రతీ ఒక్కరు అడవి శేష్ తో పాటు చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాదు సినిమా చాలా బావుందంటూ మెచ్చుకున్నారు. ఈ సినిమాతో అడవి శేష్ మళ్ళీ తన ఖాతాలో మరో డీసెంట్ హిట్ ను వేసుకున్నాడు. ఇక ఎప్పటి నుంచో హిట్ కోసం తపిస్తున్న రెజీనాకు ఈ సినిమా కాస్త ఊరటనిచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: