ఎప్పుడెప్పుడా అని మెగా అభిమానులు ఎదురుచూస్తున్న సైరా సినిమా మేకింగ్ వీడియో తాజాగా ఇటీవల విడుదలైంది. సోషల్ మీడియా లో విడుదలైన అతి కొద్ది గంటల్లోనే రికార్డులు సృష్టించే విధంగా వ్యూస్ సంపాదించే దిశగా దూసుకెళ్లి పోతుంది. ఇటువంటి తరుణంలో చాలా సంవత్సరాల తర్వాత మెగా కాంపౌండ్ నుండి మెగాస్టార్ చిరంజీవి సినిమా కి సంబంధించిన సైరా సినిమా మేకింగ్ వీడియో విడుదలైన నేపథ్యంలో సినిమాలో ఉన్న యాక్షన్ సన్నివేశాలు అదరగొట్టేసారు అనే టాక్ ఫిల్మ్ నగర్ లో వినపడుతోంది.


డైరెక్టర్ సురేందర్ రెడ్డి గతంలో ఎన్నడూ లేనివిధంగా చిరంజీవిని సినిమా లో చూపించడంతో మెగా అభిమానులు చిరంజీవి లుక్ కి ఫిదా అవుతున్నారు. అయితే తాజాగా విడుదలైన మేకింగ్ వీడియోలో పవన్ కళ్యాణ్ కనిపించడంతో కొత్తగా ఒక వార్త ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. విషయంలోకి వెళితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక పాత్ర కి వాయిస్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అవుతుంది. ఇందు మూలంగానే సినిమా మేకింగ్ వీడియోలో పవన్ కళ్యాణ్ కనిపించినట్లు టాక్ వినపడుతోంది.


ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఇచ్చిన వాయిస్ కి సంబంధించిన వీడియో ఆగస్టు 20వ తారీఖున విడుదల చేయబోతున్నట్లు కూడా సమాచారం అందుతుంది. ఒకవేళ నిజంగా పవన్ కళ్యాణ్ తో వచ్చిన వీడియో ఆగస్టు 20న విడుదల అయితే కనుక సోషల్ మీడియాలో మెగా అభిమానులకు ఇంకా పూనకాలే వస్తాయని చాలామంది సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు అంటున్నారు. చాలా సంవత్సరాల తర్వాత చిరంజీవి సినిమా వస్తున్న తరుణంలో మెగా అభిమానులు కూడా ఈ సినిమాపై చాలా అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు నిర్మాత రామ్ చరణ్ కళ్ళు చెదిరే విధంగా అత్యద్భుతంగా చేయబోతున్నట్లు ఫిల్మ్ నగర్ లో టాక్ వినపడుతుంది. అక్టోబర్ 2వ తారీఖున ఈ సినిమా విడుదల కానుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: