‘సైరా’ మేకింగ్ వీడియోకు లభించిన అనూహ్య స్పందనతో జోష్ లోకి వెళ్ళిపోయిన చిరంజీవి ఇక ‘సైరా’ ఓపెనింగ్ రికార్డ్స్ గురించి తన దృష్టి పెట్టాడు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కళ్ళు చెదిరే ఓపెనింగ్స్ రావాలి అంటే మెగా అభిమానుల సంపూర్ణ సహకారం కావాలి అన్న విషయం పూర్తిగా గ్రహించిన చిరంజీవి మన ఇరు రాష్ట్రాలకు సంబంధించిన వివిధ జిల్లాల అభిమాన సంఘాల నాయకులతో ప్రత్యేక సమావేశాలు మొదలుపెట్టి మెగా అభిమానులందర్నీ లైన్ లో పెట్టడానికి తన వ్యూహాలు మొదలు పెట్టాడు. 

దీనికి కొనసాగింపుగా ఈ నెల 22న చిరంజీవి పుట్టినరోజు రానున్న సందర్భంలో ఆ పుట్టినరోజుకు ఒకరోజు ముందుగానే ఈ నెల 21న హైదరాబాద్ శిల్పకళా మందిరంలో చిరంజీవి పుట్టినరోజు వేడుకలను అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించడానికి రామ్ చరణ్ ఏర్పాట్లు మొదలుపెట్టాడు. మెగా అభిమానులలో జోష్ ను కలిగించినప్పుడు మాత్రమే ‘సాహో’ కు భారీ కలక్షన్స్ వస్తాయి అన్న విషయం గ్రహించి ఈ విషయమై మెగా అభిమానుల సహకారం కోరబోతున్నట్లు టాక్.

చిరంజీవి కుటుంబ సభ్యులు అందరూ వచ్చే ఈ ఫంక్షన్ కు పవన్ కళ్యాణ్ ‘జనసేన’ పార్టీ నుండి ఏకైక ఎమ్.ఎల్.ఎ. గా ఎన్నికైన రాపాక వరప్రసాద్ ను కూడ ఈ కార్యక్రమానికి అతిధిగా పిలిచినట్లు టాక్. పవన్ పార్టీ తరఫున ఎన్నికైన రాపాకను మెగా అభిమానులకు పరిచయం చేసి పవన్ ‘జనసేన’ ఎన్నికలలో ఓడిపోయినా ప్రజల హృదయాలలో స్థానాన్ని ఏర్పరుచుకుంది అన్న సందేశం చిరంజీవి పుట్టినరోజు వేదిక నుండి పరోక్షంగా ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉండగా ఈ నెల 20న ముంబాయిలో విడుదల చేయబోతున్న ‘సైరా’ ట్రైలర్ కు పవన్ కళ్యాణ్ వాయస్ ఓవర్ ఇచ్చిన నేపధ్యంలో ‘సైరా’ మూవీని పవన్ అభిమానులకు కూడ బాగా కనెక్ట్ చేసి ‘సైరా’ ఓపెనింగ్ రికార్డులకు కలిసి వచ్చేలా చరణ్ మాష్టర్ ప్లాన్ కొనసాగుతోంది అని అంటున్నారు. ఒకవైపు ‘సైరా’ కలక్షన్స్ రికార్డుల పై దృష్టి పెడుతూ మరొక వైపు ఎన్నికలలో ఓడిపోయినా ‘జనసేన’ కు భవిష్యత్ ఉంది అన్న సంకేతాలు ఇచ్చే విధంగా చిరంజీవి పుట్టినరోజు వేడుకలకు ‘జనసేన’ మేకప్ తో పవన్ చిరంజీవి అభిమానుల మధ్య కోలాహలంగా జరుపుకోవడానికి భారీ ప్లాన్స్ లో ఉన్నట్లు సమాచారం..  


మరింత సమాచారం తెలుసుకోండి: