వివాదాస్పద రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు  ఈ సీజన్ ప్రారంభ ఎపిసోడ్ ఏకంగా 17.9 టీవీఆర్ పాయింట్స్ రాబట్టి టెలివిజన్ చరిత్రలోనే అత్యధిక టీఆర్పీని సాధించిన షో గా గుర్తింపు పొందింది.  షో స్టార్ట్ అయ్యి మొదటి ఎలిమినేషన్ అయ్యే వరకు కూడా ఈ షో బాగానే సాగింది. అయితే వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా  తమన్నా సింహాద్రి హౌజ్ లోకి ఎంట్రీ ఇవ్వడం.. ఆ తరువాత ఆమె ప్రవర్తన తో షో  మీద జనాలకు విసుగు తెప్పించింది. ఫలితంగా రేటింగ్స్ పడిపోయాయి.  ఇప్పుడు ఈ షో  రోజు 12 కంటే  ఎక్కువగా రేటింగ్స్ ను రాబట్టలేకపోతుందట. 


ఇక స్టార్ మా లోనే ప్రసారమవుతున్న టీవి సీరియల్  కార్తీక దీపం రోజు 15.4 రేటింగ్స్ ను రాబట్టుకుంటుంది.  ఈ సీరియల్ కు తెలుగు రాష్ట్రాల్లో విపరితమైన ఫాలోయింగ్ వుంది. గతంలో మొగలిరేకులు ఎలాగో ఇప్పుడు ఈ సీరియల్ అలా రన్ అవుతుంది.  బిగ్ బాస్ ను అయినా పక్కకు పెడుతున్నారు కానీ ఈ సీరియల్ ను మాత్రం  మిస్ కావడం లేదు టీవి వీక్షకులు. దాంతో   రేటింగ్స్  విషయంలో లో ఈ సీరియల్ దాదాపు ప్రతి వారం మొదటి స్థానంలోనే కొనసాగుతుంది.  కాగా కార్తీక దీపం ప్రీమియర్  ఎపిసోడ్ అత్యధికంగా 18 టీవీఆర్ పాయింట్స్ ను  రాబట్టుకుంది.



అయితే  ఈ సీరియల్ శనివారం వరకే రావడంతో ఆదివారం బిగ్ బాస్ డామినేషన్ కొనసాగుతుంది. ఇక బిగ్ బాస్ 2 కూడా  మొదట్లో  ఇలాగే నత్తనడకన సాగింది. కానీ కౌశల్ వల్ల ఆ తరువాత షో క్రమంగా  పుంజుకుంది. కాగా బిగ్ బాస్ 3లో అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించే కంటెస్టెంట్స్ లేకపోవడం కూడా రేటింగ్స్ ఫై ప్రభావం చూపుతుంది. అయితే గత వారం తమన్నా ఎలిమినేట్ అయిపోవడం బిగ్ బాస్ 3 కు ప్లస్సే. మరి ముందు ముందు ఈషో ఎలాంటి రేటింగ్స్ ను రాబట్టుకుంటుందో చూడాలి. 




మరింత సమాచారం తెలుసుకోండి: