మూడు వారాల క్రిందట ప్రారంభమైన బిగ్ బాస్ షో రోజు రోజుకు ఆసక్తికరంగా సాగుతోంది. ఈ వారం ఏడుగురు ఇంటి సభ్యులు ఎలిమినేషన్ కు నామినేట్ అయ్యారు. శ్రీముఖి రోహిణిని ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని అనటంతో రోహిణి హర్ట్ అయింది. రోహిణి నేను వెళ్ళపోతానో, వెళ్ళిపోనో తరువాత సంగతి కానీ ఈ వారం నువ్వే వెళ్ళిపోతావని ముఖం మీద అంటే ఎలా ఉంటుందని బాబా భాస్కర్ కు శ్రీముఖి అన్న విషయం గురించి చెబుతుంది రోహిణి. 
 
నేను ఉన్నన్ని రోజులు మంచిగానే ఉంటానని, పాజిటివ్ వైబ్ తోనే ఇంటినుండి వెళ్ళాలని ఉందని శ్రీముఖికి చెబుతుంది రోహిణి. నువ్వు ఈ విషయంలో హర్ట్ అవుతావని నేను అనుకోలేదు ఇంకోసారి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడతానని చెబుతుంది శ్రీముఖి. శ్రీముఖి రోహిణికి నా వలన తప్పు జరిగింది క్షమించమని చెబుతుంది. శ్రీముఖి క్షమించమని అడగటంతో రోహిణి, శ్రీముఖి మధ్య గొడవ ముగుస్తుంది. 
 
కెప్టెన్సీ టాస్కులో మూడు డ్రాగన్ గుడ్లు రాహుల్, అలీ, రవికృష్ణ ముగ్గురి దగ్గర ఉంటాయి. ఎవరు కుర్చీలో ఎక్కువ సమయం కూర్చుంటారో వారే కెప్టెన్ అవుతారని బిగ్ బాస్ ఆదేశిస్తాడు. కెప్టెన్ గా గెలవటానికి, ఓడించటానికి ఇంటి సభ్యులు సహాయం చేయవచ్చని బిగ్ బాస్ చెబుతాడు. శ్రీముఖి రవికృష్ణ, అలీ ఇద్దరికీ సాయం చేస్తానని రాహుల్ ను మాత్రం ఓడించటానికి ప్రయత్నం చేస్తానని చెబుతుంది. రవికృష్ణకు చేతికి గాయం అయినందుకు టాస్కుకు దూరంగానే ఉంటాడు.వితిక, పునర్నవి ఎవరికీ సపోర్ట్ చేయకుండా ఉంటారు. ఎక్కువ సమయం అలీ కుర్చీపై ఉండటంతో అలీ కెప్టెన్ గా గెలుస్తాడు. రవికృష్ణ కెప్టెన్ కానందుకు కొంచెం బాధపడతాడు. కెప్టెన్ అలీకి ఇంటి సభ్యులు ఏమేం మార్పులు చేయాలో సూచనలిస్తారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: