మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన సైరా మూవీ మేకింగ్ వీడియో నిన్న రిలీజ్ అయ్యింది.  కొద్దిసేపటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది.  యూట్యూబ్ లో వైరల్ గా మారింది.  మెగాస్టార్ సినిమా కోసం ఎంతగా కష్టపడ్డారో ఈ మేకింగ్ వీడియో చూస్తే అర్ధం అవుతుంది.  విజువల్ ఎఫెక్ట్స్ కాలేదని, అసలు అక్టోబర్ 2 వ తేదీన రిలీజ్ అవుతుందా అనే సందేహాలు వచ్చాయి.  ఈ సందేహాలను పక్కన పెడుతూ.. అన్ని ఏర్పాట్లు చేస్తోంది యూనిట్.  



మెగాస్టార్ బర్త్ డే రోజున ఈ సినిమా టీజర్ రిలీజ్ చేస్తారని అనుకున్నారు.  కానీ, టీజర్ ను మెగాస్టార్ బర్త్ డే రోజున కాకుండా రెండు రోజుల ముందుగానే రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు.  రెండు రోజుల ముందుగానే రిలీజ్ చేయడం వలన బర్త్ డే వరకు మంచి మైలేజ్ వస్తుందని యూనిట్ భావిస్తోంది.  అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారట.  



యూనిట్ టీజర్ ను రెడీ చేసే పనిలో ఉన్నది.  మెగాస్టార్ దోహాలో జరిగే సైమా వేడుకలకు వెళ్ళబోతున్నారు.  ఆ వేడుకల్లో ట్రైలర్ ను రిలీజ్ చేస్తారని అనుకున్నారు.  కానీ, అవేమి లేదని అర్ధం అయ్యింది.  ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ సైరాకు సంబంధించిన ఎలాంటి న్యూస్ ఉండదని తెలుస్తోంది.  ఆగష్టు 20 వ తేదీన సైరా టీజర్ రిలీజ్ కాబోతున్నది.  


ఈ టీజర్ లో పవన్ కళ్యాణ్ వాయిస్ ఉన్నట్టుగా ప్రచారం జరుగుతున్నది.  ఇందులో ఎంతవరకు నిజం ఉందని విషయం తెలియాలి.  పవన్ కళ్యాణ్.. మెగాస్టార్ తో కలిసి డబ్బింగ్ స్టూడియోలో దిగిన ఫోటోను ఇటీవలే రిలీజ్ చేశారు. కేవలం టీజర్ వరకే ఈ వాయిస్ ఉంటుందా లేదంటే.. సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ వాయిస్ ఉంటుందా అన్నది తెలియాల్సి ఉన్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: