పూరి జగన్నాధ్.. అలీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పాలి.  ఇద్దరికీ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో అనుబంధం ఉన్నది.  అలీ  చిన్న తనంలో ఎంతగా కష్టపడి వచ్చాడో తెలుసు.  పూరి జగన్నాథ్ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తరువాత ఇండస్ట్రీలో మొదటి పరిచయమైనా వ్యక్తి అలీ.  అప్పటి నుంచి ఆలీతో స్నేహం కంటిన్యూ అవుతూనే ఉన్నది.  



పూరి జగన్నాథ్ సినిమా దర్శకుడుగా మారిన తరువాత తన ప్రతి సినిమాలో అలీకి తప్పకుండా ఒక పాత్రను సృష్టిస్తాడు పూరి.  వారిద్దరి మధ్య అనుబంధం అలాంటిది.  ఇద్దరు మంచి స్నేహితులు.  కష్టాల్లో ఉన్నప్పుడు ఆలీ వచ్చి పెగ్ ఇస్తాడట.  సినిమా హిట్ కొట్టినప్పుడు అదే అలీ బొకే ఇచ్చి హాగ్ చేసుకుంటాడట.  అందుకే అలీ అంటే అంతటి ఇష్టం అని చెప్తున్నాడు పూరి.  



ఇస్మార్ట్ శంకర్ తో పాటు రెండు మూడు సినిమాలు తప్పించి మిగతా అన్ని సినిమాల్లో పూరి సినిమాల్లో అలీకి పాత్ర ఉంటుంది.  తన నెక్స్ట్ సినిమాలో అలీ కోసం ఓ పాత్రను సృష్టిస్తున్నారట.  ఇప్పటికే దీన్ని కన్ఫామ్ చేశారు.   అలీతో స్నేహం ఎలా మొదలైంది అనే దానికి పూరి భలే సమాధానం చెప్పారు.  



"అలీతో అనుబంధం ఇప్పటిది కాదు. పూరి దర్శకుడు కాకముందే అలీకి అభిమాని. అలీ నటించిన సీతాకోక చిలుక చూశాక అభిమాని అయిపోయాడు. అతడు ఓ పార్టీ కోసం పూరి స్వస్థలానికి దగ్గరగా ఉండే `తుని`కి అలీ వస్తున్నాడని తెలిసి అక్కడికి వెళ్లారు. అప్పుడు మొదలైన స్నేహం ఇప్పటికీ కొనసాగుతోంది" అని చేప్పారు.  చెప్పినట్టుగానే ఇప్పటికి వారిమధ్య మైత్రి అలా కొనసాగుతూనే ఉన్నది.  ఓసారి ఉన్న ఆస్తులన్నీ పోగొట్టుకుని చివరికి ఆఫీస్ కూడా అమ్ముకుని వెళ్లిపోవాల్సిన పరిస్థితిలో అలీ వచ్చి ఒక దేవుడి ఫోటో ఇచ్చాడు. అన్ని కష్టాలు తొలిగిపోతాయని అన్నాడు.  అలీ చెప్పినట్టుగానే జరిగింది.  అప్పటి నుంచి ఆలీపై అభిమానం మరింతగా పెరిగిందని చెప్పుకొచ్చాడు పూరి.  


మరింత సమాచారం తెలుసుకోండి: