తాజాగా రిలీజ్ కి సిధ్ధంగా ఉన్న మెగాస్టార్ సైరా మూవీతో మొదలుపెడితే వెండితెర మీద దేశం స్వాతంత్ర పోరాటం ఎంతలా వెలిగిపోయిందో చెప్పనక్కరలేదు. అదొక పెద్ద చరిత్ర అవుతుంది. ఎందరో అగ్ర నటులు దేశ భక్తుల పాత్రల్లో చక్కగా నటించి ఒదిగిపోయారు. మువ్వన్నెల జెండా రెపరెపలను సెల్యూలాయిడ్ మీద అందంగా చూపించి ప్రజల్లో చైతన్యం తెచ్చారు.


సూపర్ స్టార్ క్రిష్ణ అల్లూరి సీతారామరాజు అద్భుతమైన వీరుడి గాధ. కళ్ళకు కట్టినట్లుగా ఆనాటి పరిస్థితులను వివరించడం ద్వారా ఈ మూవీ అతి పెద్ద సక్సెస్ కొట్టింది. ఇందులో క్రిష్ణ అల్లూరి గా నిజంగా జీవించారనే చెప్పాలి. ఆ సినిమాను చేద్దామను రెండు మార్లు ముహూర్తం పెట్టుకుని స్రిప్ట్ ని కూడా రెడీ చేసుకున్న నాటి అగ్ర నటుడు  నందమూరి తారక రామారావు చివరికి చేయలేకపోయారు.


ఆయన జీవిత చిర కాల కోరికగా అల్లూరి పాత్ర మిగిలిపోయింది. ఈ సినిమా క్రిష్ణ తీయడంతో అన్న గారితో కొన్నాళ్ళు విభేదాలు వచ్చాయి. దాంతో టాలీవుడ్లో ఇద్దరు అగ్రనటులుల మధ్య విభేదాలతో చిత్రం సీమ కొంత ఇబ్బందులకు  గురి అయింది. తిరిగి ఈ ఇద్దరు 1982లో వయ్యారి భామలు వగలమారి భర్తలు మూవీల నటించేంతవరకూ ఆ విభేదాలు సమసిపోలేదు.


ఇక అల్లూరి పాత్రను చేయలేకపోయిన అన్నగారు దాసరి నారాయణరావు డైరెక్షన్లో సర్దార్ పాపారాయుడు మూవీలో ఒకసారి కనిపించి ఆ ముచ్చట తీర్చుకున్నారు. ఆ విధంగానే ఆయన చివరి రోజుల్లో  రాఘవేంద్రరావు దర్శకత్వంలో మేజర్ చంద్రకాంత్ మూవీలో కూడా అల్లూరిగా కొంతసేపు కనిపిస్తారు. మొత్తానికి అన్న గారి డ్రీమ్  క్యారక్టర్ ని అలా సూపర్ స్టార్  క్రిష్ణ చేయడం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ రేర్ ఫీట్ గా చెప్పుకోవాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: