త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల్లో అందరు బాగా ఇష్టపడేది.. సందర్భానుసారం వచ్చే పంచ్ డైలాగులు. పంచ్ అనగానే ఏదో పదాల ప్రాసతో కనికట్టు చేసినట్టు కాకుండా అతితక్కువ మాటలతోనే లోతైన అర్థం వచ్చేలా  అందమైన ప్రాసలో డైలాగ్ లను రాయడంతో ఈ మాటల మాంత్రీకుడిని మించినవారు ప్రస్తుతానికైతే ఇండస్ట్రీలో లేరు.  చాలామంది ఆ స్టైల్ ను కాపీ కొడదామని ఎంత ప్రయత్నించినా బోల్తా పడ్డవాళ్ళే ఎక్కువ.  ఇప్పటికీ  ఆవిషయంలో త్రివిక్రమ్ ని దాటే రచయిత మరొకరు లేరు అనడంలో ఏమాత్రం సందేహం లేదు.  

ఇక ఈ దర్శకుడి సినిమాల్లో రెగ్యులర్ గా కనిపించే మరో విషయం ఆర్టిస్టులను రిపీట్ చేయడం. ఒకసారి పని చేసిన వారితో మళ్ళీ మళ్ళీ పని చేస్తూ ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో త్రివిక్రమ్ ఇలా రిపీట్ చేస్తారని ఒక మాట ఉంది. తన సినిమాలో ఒకసారి ఎవరైనా హీరోయిన్ పని చేస్తే.. అదే హీరోయిన్ ను తన నెక్స్ట్ సినిమాల్లో రిపీట్ చేస్తూ ఉంటారు.  గతంలో ఇలియానాతో ముందుగా 'జల్సా' సినిమాకు పని చేశారు..  ఆ తర్వాత 'జులాయి' లో సేమ్ హీరోయిన్ ను రిపీట్ చేశారు.  సమంత తో 'అత్తారింటికి దారేది' సినిమాకు పని చేశారు.  సామ్ వర్క్ స్టైల్ నచ్చడంతో 'సన్నాఫ్ సత్యమూర్తీ.. 'అ ఆ' సినిమాలకు పని చేశారు. ఇక 'అరవింద సమేత' లో మొదటిసారిగా పూజా హెగ్డేతో పనిచేశారు. ఇప్పుడు మరోసారి అల్లు అర్జున్ కొత్త సినిమాకు పూజా హెగ్డే ని రిపీట్ చేస్తున్నారు. బన్ని వేరే హీరోయిన్ ని తీసుకుందామని చెప్పినా చివరికి త్రివిక్రమ్ మాటే చెల్లింది.

త్రివిక్రమ్ కి హీరోయిన్ వర్క్ స్టైల్ నచ్చితే చాలు.. నెక్స్ట్ సినిమా కోసం కొత్త హీరోయిన్ కోసం దాదాపుగా వెతకరని.. సాధ్యమైనంతవరకూ హీరో, నిర్మాతలను కన్విన్స్ చేసి ఆ హీరోయిన్ తోనే మరోసారి పని చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారని ఆయనను క్లోజ్ గా ఫాలో అయ్యేవారు చెప్తుంటారు.  ఒక రకంగా ఇది హీరోయిన్లకు కూడా కంఫర్టే. ఎందుకంటే డైరెక్టర్ వర్కింగ్ స్టైల్ తెలిసి ఉంటుంది కాబట్టి అలా సీన్ గురించి చెప్తే చాలు.. ఇలా అల్లుకుపోవచ్చు! ఏదేమైనా త్రివిక్రమ్ హీరోయిన్ చాలా లక్కీ అని చెప్పాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: