బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ కి టాస్క్ ఇచ్చేది జనాలకి ఎంటర్ టైన్ మెంట్ కోసమే. కంటెస్టెంత్స్ టాస్క్ ని సీరియస్ గా ఆడితేనే ఫన్ జనరేట్ అవుతుంది. గత సీజన్లలో కెప్టెన్సీ టాస్క్ లో విజయం కోసం ఎంతలా ప్రయత్నించేవారో చూసాం. ఈ సీజన్ లో టాస్క్ లని కంటెస్టెంట్స్ పెద్దగా పట్టించుకోవట్లేదని తెలుస్తుంది. బుధవారం జరిగిన ఎపిసోడ్ ని చూస్తే ఈ విషయం క్లియర్ గా అర్థం అవుతుంది. సింహాసనం మీద కూర్చున్న ఆలీని దింపడానికి ఎవరూ సరిగ్గా ప్రయత్నించలేదు. 


ముఖ్యంగా ఆలీకి తప్ప రాహుల్ , రవి లకి ఎవరూ సపోర్ట్ చేయలేదు. రాహుల్ కి ఒక సెపరేట్ గ్రూప్ ఉన్నా కూడా వాళ్ళు ఈ టాస్క్ లో రాహుల్ ని సపోర్ట్ చేసి ఉంటే మరింత బాగుండేది. శ్రీముఖి, బాబా భాస్కర్ లు ఆలీకి ఎలా సపోర్ట్ చేసారో వితికా, పునర్నవిలు అలా చేసి ఉంటే మరింత మజా వచ్చేది. కానీ రాహుల్ మిత్ర బృందం ఈ టాస్క్ తమది కాదన్నట్టుగా సైలెంట్ గా ఉండిపోయారు. ఇదే టాస్క్ హింది సీజన్ లో ఇచ్చినపుడు అక్కడ రచ్చ రచ్చ చేసారు. ఇక్కడ మాత్రం చాలా చప్పగా సాగింది.


కెప్టెన్సీ టాస్క్ ఒక్కటే కాదు ఏ టాస్క్ లో అయినా కంటెస్టెంట్స్ తీరు అలాగే ఉంది. వాళ్ళలో వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి టాస్క్ ని పూర్తి చేసే పనిమీదే ఉన్నారు తప్పితే, సీరియస్ గా టాస్క్ ఆడదాం అన్నట్టు ఎవరూ కనబడట్లేదు. ప్రతీ ఒక్కరూ ఎవరేమనుకుంటారో, ఇమేజ్ ఎక్కడ డ్యామేజ్ అవుతుందో అని భయపడుతూ గేమ్ ఆడుతున్నారు. ఇలానే అయితే బిగ్ బాస్ షో చాలా చప్పగా అయ్యే అవకాశం ఉంది. నాగార్జున ఈ విషయం మీద ఒకసారి చెప్తే బాగుంటుందని విశ్లేషిస్తున్నారు. మరి రానున్న ఎపిసొడ్ లు ఎలా ఉంటాయో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: