నిత్యం వివాదాల్లో ఉండటం రామ్ గోపాల్ వర్మ కు ఇష్టం అని మీడియా కోడై కూస్తుంది. నిజంగానే వర్మ వివాదాలు సృష్టిస్తున్నాడా లేదా వర్మను  కావాలనే వివాదాల్లోకి లాగుతున్నారా అంటే రెండింటికీ అవుననే సమాధానం వస్తుంది. వర్మ చెప్పే లాజిక్స్ వివాదం చేస్తున్నారు. అందుకే వర్మ వివాదాస్పద వ్యాఖ్యలకు అలవాటుపడి మరింత వివాదానికి కారణమవుతున్నాడు. ప్రపంచంలో అతనికి అక్కరలేని టాపిక్ ఉండదు.

 

 

 

తాజాగా రాంగోపాల్ వర్మ.. 'కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్‌లో పోటీచేస్తే తప్పకుండా గెలుస్తుంది. కశ్మీర్‌పై కాంగ్రెస్ విధానం పాక్‌కు అనుకూలంగా ఉంది' అంటూ తన అభిప్రాయాన్ని ట్విటర్ లో రాశాడు. కశ్మీర్ అంశంలో కాంగ్రెస్ విధానాన్ని పరిశీలిస్తే ఇదే భావన కలుగుతుంది. కానీ ఇది వర్మ చెప్పాడు కాబట్టి మరింత హైలైట్ అవుతోంది. దీంతో వర్మ రాజకీయ నాయకులను రెచ్చగొడుతున్నాడు అంటూ మరింత వివాదానికి తెర తీస్తారు. అలాగే.. వర్మకు రోజూ ఉదయం పోర్న్ చూడటం ఇష్టం అనే విషయం తెలిసిందే. రీసెంట్ ఇంటర్వ్యూలో మళ్లీ ఇదే విషయాన్ని హైలైట్ చేసాడు. రాత్రి ఎన్ని గంటలకు పడుకున్నా ఉదయం 6 గంటలకే లేచి పావుగంట పోర్న్, తర్వాత ఒక డాక్యుమెంటరీ చూస్తే తనకు ఆ రోజుకు సరిపడా ఉత్సాహం వస్తుందని అన్నాడు. ఇది వివాదాస్పద వ్యాఖ్య కాదు కానీ సమాజంపై  ప్రభావం   చూపుతుంది.. సెలెబ్రిటీ కాబట్టి. నిజానికి ఇది తన ఇష్టం. 

 

 

 

ఆమధ్య పవన్ కల్యాణ్ మీద తాను చేయించిన వివాదాస్పద వ్యాఖ్యలు ఎంతమాత్రం క్షమార్హం కాదు. ఇలాంటి విషయాల్లో వర్మ శాడిజాన్ని, మూర్ఖత్వాన్ని నడిరోడ్డుపై పెట్టాలి. తన అభిప్రయాలకు, ఇష్టాలకు కూడా చర్చలు చేయడంతో అతని ఇష్టాలను పబ్లిక్ చేస్తున్నాడు. వర్మ ఇష్టాలు, అభిప్రాయాలు నచ్చేవాళ్ళు కూడా ఉండటంతో తన పని తాను చేసుకుపోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: