సోగ్గాడే చిన్ని నాయన సినిమా తరువాత నాగార్జునకు ఆ రేంజ్ హిట్ పడలేదు. ఊపిరి, ఓం నమో వెంకటేశాయ, రాజు గారి గది 2 , ఆఫీసర్, దేవదాస్, మన్మథుడు2 సినిమాల్లో ఏ సినిమా కూడా నాగార్జునకు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. నాగార్జున బిగ్ బాస్ షో పూర్తి అయిన తరువాత కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సోగ్గాడే చిన్ని నాయన సీక్వెల్ బంగార్రాజు సినిమాలో నటించబోతున్నాడు. 
 
మన్మథుడు2 ఫలితంతో బంగార్రాజు కథ, కథనాల్లో మార్పులు చేర్పులు చేస్తున్నారని తెలుస్తుంది. సోగ్గాడే చిన్న నాయన సినిమాలో రొమాన్స్ పాళ్ళు ఎక్కువగా ఉంటాయి. మన్మథుడు2 సినిమాలో కూడా రొమాన్స్ పాళ్ళు ఎక్కువగానే ఉన్నాయి. కానీ మన్మథుడు2 ఆశించిన ఫలితం ఇవ్వకపోవటంతో బంగార్రాజు సినిమాలో కొన్ని మార్పులు చేయమని దర్శకునికి సూచించాడట నాగార్జున. బంగార్రాజు సినిమాలో నాగార్జునతో పాటు నాగచైతన్య కూడా నటిస్తున్నాడు. .నాగ చైతన్యకు జోడీగా కీర్తి సురేశ్ బంగార్రాజు సినిమాలో ఎంపికయింది. 
 
గత వారం విడుదలైన మన్మథుడు2 సినిమా 6 రోజుల్లో 11 కోట్ల రుపాయల షేర్ వసూలు చేసింది. సినిమా హిట్ కావాలంటే 8 కోట్ల రుపాయల షేర్ వసూలు చేయాల్సి ఉంది. ఈ రోజు రెండు సినిమాలు విడుదలవుతూ ఉండటంతో మన్మథుడు2 కలెక్షన్లు ఇంకా తగ్గే అవకాశం ఉంది. ఈరోజు విడుదలైన ఎవరు, రణ రంగం సినిమాలకు ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. 
 
మన్మథుడు2 సినిమాకు సక్సెస్ టూర్ చేయాలని నాగార్జున అనుకున్నప్పటికీ సినిమా కలెక్షన్లు ఆశించిన స్థాయిలో లేకపోవటంతో నాగార్జున ఈ విషయంలో డ్రాప్ అయినట్లు సమాచారం. మన్మథుడు 2 హిట్ కాకపోవటంతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కు ఇప్పట్లో మరో సినిమా అవకాశం రావటం కష్టమేనని సమాచారం. నాగార్జున నటించిన మన్మథుడు2 సినిమా ఫ్లాప్ అయినప్పటికీ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ షో హిట్ అవ్వటం విశేషం. 



మరింత సమాచారం తెలుసుకోండి: