ఇడియట్ సినిమాతో మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రవితేజ తర్వాత వరుసగా విజయాలు అందుకుంటూ స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు.  పవర్ సినిమా తర్వాత రవితేజ నటించిన అన్ని మూవీస్ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.  దాంతో కెరీర్ గాడి తప్పడంతో రెండేళ్లు విరామం తీసుకున్నాడు. అనీల్ రావిపూడి దర్శకత్వంలో ‘రాజా ది గ్రేట్’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు.

ఈ సినిమాలో అంధుడిగా రవితేజ్ పర్ఫామెన్స్ ఇరగదీశాడు.  మాస్ మహరాజా ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోయారు.  కానీ ఆ సినిమా తర్వాత నాలుగు సినిమాలు మళ్లీ అట్టర్ ఫ్లాప్ కావడంతో రవితేజ ఆలోచనలో పడ్డారు. అన్ని విషయాల్లో చాలా కంట్రోల్ చేస్తూ ఈసారిమ మంచి హిట్ కోసం పరితపిస్తున్నాడు. మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టిస్తున్న తాజా చిత్రం డిస్కో రాజా. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ఒక్క క్షణం’ చిత్రాల ద‌ర్శ‌కుడు వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎస్‌.ఆర్‌.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ తాళ్లూరి నిర్మించ‌నున్నారు.

ఈ మూవీలో నభా నటేశ్‌, పాయల్ రాజ్ పూత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.  ఇప్పటి వరకు ఈ మూవీ లోగో రిలీజ్ చేసినా..నేడు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ‘డిస్కోరాజా’ నుంచి రవితేజ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.  కాకపోతే ఈ స్టిల్ లో రవితేజ్ ముఖం అటువైపు తిప్పి ఉంది..కానీ స్టిల్ మాత్రం అదిరిందంటున్నారు ఫ్యాన్స్.

సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ మూవీ తెరకెక్కిస్తున్నారట. వెన్నెల కిషోర్, సునీల్‌ ప్రధాన పాత్రలో నటించనున్న ఈ చిత్రానికి ఎస్‌.ఎస్‌. తమన్‌ స్వరకర్త. అయితే ఈ చిత్రం కొంత భాగం చెన్నై నేప‌థ్యంలో సాగనున్న‌నేప‌థ్యంలో త‌మిళ స్టార్ బాబీ సింహాని ప్ర‌తి నాయ‌కుడిగా ఎంపిక చేశార‌ని తెలుస్తుంది.  త్వ‌ర‌లో ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేస్తామ‌ని మేక‌ర్స్ అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: