‘సైరా’ మేకింగ్ వీడియోకు అద్భుతమైన స్పందన లభించడంతో జోష్ లోకి వెళ్ళిపోయిన సురేంద్ర రెడ్డ్డి తన అనందాన్ని ఒక మీడియా సంస్థకు షేర్ చేస్తూ ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘బాహుబలి’ పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. ‘సైరా’ మేకింగ్ వీడియోలో బ్యాక్ డ్రాప్ విజువల్స్ చూసి ఈ సినిమాను ‘బాహుబలి’ సినిమాతో పోల్చుతున్న విషయం పై స్పందిస్తూ ‘సైరా’ కు  ‘బాహుబలి’ కి పోలికలు పెడుతూ కామెంట్స్ చేయడం అవివేకం అంటూ కామెంట్స్ చేసాడు. 

‘సైరా’ అనేది నిజ జీవితంలో జరిగిన కథ అని ఆకధను చాలా జాగ్రత్తగా చూపించవలసిన అవసరం ఉందని ‘బాహుబలి’ ఒక ఊహా జనితమైన కథ కాబట్టి ఆ సినిమాను తీసే విషయంలో దర్శకుడికి పూర్తి స్వేఛ్చ ఉంటుంది అంటూ కామెంట్స్ చేసాడు. ఇదే సందర్భంలో ‘సైరా’ నిర్మాణంలో జరిగిన ఆలస్యం గురించి మాట్లాడుతూ ‘సైరా’ అనేది ఒక పెద్ద ప్రాజెక్ట్ కేవలం ఇంత సమయంలోనే ఫినిష్ చేయాలని చేసే సినిమా కాదు అని అంటూ కొన్ని సీన్లు షూట్ చేసేందుకు  ఎక్కువ సమయం పట్టిన విషయాన్ని వివరించాడు.

ఇది ఇలా ఉండగా నిన్న విడుదలైన ‘సైరా’ మేకింగ్ వీడియోకు విడుదలైన గంటలోపే దాదాపు రెండు లక్షల వ్యూస్ ను సంపాదించుకోవడం ఒక ఇండస్ట్రీ రికార్డ్ గా మారింది. ప్రస్తుతం ఈ వీడియోకు వస్తున్న స్పందనతో ఈ వీడియోకు పది మిలియన్ వ్యూస్ వచ్చినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఫంక్షన్ ను బాలీవుడ్ మీడియా అదిరిపడే విధంగా ముంబాయిలో నిర్వహించేందుకు భారీ ప్రణాళికలు రచిస్తున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ తో పాటు చిరంజీవితో సన్నిహితంగా ఉండే అనేకమంది బాలీవుడ్ సెలెబ్రెటీలు ఈ ట్రైలర్ లాంచ్ ఫంక్షన్ కు రాబోతున్నారు. ఈ ట్రైలర్ లాంచ్ తరువాత ‘సైరా’ ప్రమోషన్ మరింత వేగం పెంచాలని రామ్ చరణ్ పక్కా ప్లాన్స్ లో ఉన్నట్లు టాక్.. 
  


మరింత సమాచారం తెలుసుకోండి: