కలుసుకోవాలని సినిమాతో రచయితగా కెరీర్ స్టార్ట్ చేసాడు వక్కంతం వంశీ. వక్కంతం వంశీ ఎక్కువగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన సినిమాలకు రచయితగా పనిచేసాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అశోక్, అతిథి, కిక్, ఊసరవెళ్ళి, రేసుగుర్రం, కిక్ 2 సినిమాలకు వక్కంతం వంశీ కథ అందించాడు. కిక్, రేసుగుర్రం సినిమాలు సూపర్ హిట్ కాగా మిగతా సినిమాలు అనుకున్న స్థాయి ఫలితాన్ని అందుకోలేదు. 
 
వంశీ పైడిపల్లి ఎవడు, ఎన్టీయార్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన టెంపర్ సినిమాకు కూడా వక్కంతం వంశీ కథ అందించాడు. ఎన్టీయార్ జనతా గ్యారేజ్ సినిమాలో నటించిన తరువాత ఎన్టీయార్, వక్కంతం వంశీ కాంబినేషన్లో సినిమా మొదలవుతుందని కల్యాణ్ రామ్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తాడని వార్తలు వచ్చాయి. కానీ ఈ సినిమా ఎందుకో మొదలుకాలేదు. జనతా గ్యారేజ్ తరువాత ఎన్టీయార్ కల్యాణ్ రామ్ నిర్మాతగా బాబీ దర్శకత్వంలో జై లవ కుశ సినిమాలో నటించాడు.  
 
ఎన్టీయార్ ఛాన్స్ ఇవ్వకపోయినా అల్లు అర్జున్ వక్కంతం వంశీకి ఛాన్స్ ఇచ్చాడు. అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ డైరెక్టర్ గా 2018 మే నెలలో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా విడుదలైంది. సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు నిర్మాతలు ఆశించిన స్థాయిలో రాలేదు. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాలోని అల్లు అర్జున్ పాత్రకు మాత్రం మంచి గుర్తింపు వచ్చింది 
 
నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా హిట్ అయి ఉంటే దర్శకుడిగా వక్కంతం వంశీకి వెంటనే అవకాశాలు వచ్చేవి. కానీ సినిమా ప్లాప్ కావటం, స్టార్ హీరోలు వేరే సినిమాల కమిట్మెంట్లతో బిజీగా ఉండటంతో ఇప్పట్లో వక్కంతం వంశీకి స్టార్ హీరోల సినిమాలకు డైరెక్టర్ గా అవకాశాలు రావటం కష్టమని సమాచారం. మిడిల్ రేంజ్ హీరోలు మాత్రం వక్కంతం వంశీకి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: