Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Sep 22, 2019 | Last Updated 9:31 pm IST

Menu &Sections

Search

కాంట్రవర్సీ హీరో టాప్ దర్శకుల లీస్ట్ లొ చేరాడు!

కాంట్రవర్సీ హీరో టాప్ దర్శకుల లీస్ట్ లొ చేరాడు!
కాంట్రవర్సీ హీరో టాప్ దర్శకుల లీస్ట్ లొ చేరాడు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
అదేంటీ కాంట్రవర్సీ హీరో టాప్ దర్శకుల్లో చేరారా అనుకుంటున్నారా? అవును, ఒకప్పుడు ఆ హీరో నటించే చిత్రాలు చాలా నేచురల్ గా చిత్ర విచిత్రంగా ఉండేవి.  అతని చిత్రాలు రిలీజ్ అవుతుంటే కన్నడ నాటనే కాదు అన్ని భాషల్లో ఎప్పుడు డబ్ అవుతాయా అని ఎదురు చూసే వారు..ఇంతకీ ఆ హీరో ఎవరా అనుకుంటున్నారా ఆయన ఎవరో కాదు ఉపేంద్ర.  ఆ మద్య త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రంలో నటించిన ఉపేంద్ర.  ఒక సామాన్య కుటుంబం నుంచి స్టార్ హీరోగా ఎదిగారు ఉపేంద్ర. 

ఆయన పూర్తి పేరు ఉపేంద్ర రావు... కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి జిల్లా, కుందాపుర లోని తెక్కెట్టెలో మంజునాధరావు మరియు అనసూయమ్మ లకు జన్మించాడు.  ఉపేంద్రకు ఒక సోదరుడు ఉన్నారు. చిన్నతనంలో ఆయన తండ్రి ఎన్నో కష్టాలు పడి కుటుంబాన్ని పోషించే వారు.  చిన్నతనంలో ఉపేంద్ర కంటికి గాయమై ఇన్ ఫెక్షన్ అయ్యింది. శస్త్రచికిత్స తీసుకున్నా ఆయన ఇప్పటికీ  కనుగుడ్లు త్రిప్పడంలో ఇబ్బందిని ఎదుర్కొంటున్నాడు. దీనిని మనం ఇతడు నటించిన చిత్రాలలో కూడా గమనించవచ్చు. బెంగుళూరు లోని ఎ.పి.ఎస్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుండి బికాం పట్టాను అందుకున్నాడు. కాలేజీలో ఉండగానే ఎంతో మంది కన్నడ హీరోలను స్ఫూర్తిగా తీసుకొని ఒక నాటక బృందాన్ని ఏర్పాటు చేసుకొని నాటక ప్రదర్శనలు చేసేవాడు.

అలా నటిస్తూనే డిగ్రీ చివరి సంవత్సరంలో తన దూరపు బంధువైన ప్రముఖ కన్నడ నటుడు కాశీనాధ్ దృష్టిలో పడ్డాడు . నటుడిగా చిన్న చిన్న పాత్రల్లో నటించి తర్వాత హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఉపేంద్రకు సినీరంగంలోని దాదాపు అన్ని విభాగాలలో చాలా మంచి పరిజ్ఞానం ఉంది. దర్శకుడిగా తన సినీ జీవితం ప్రారంభించినప్పటికీ నటుడిగా, కథా రచయితగా, పాటల రచయితగా, సంగీత దర్శకుడిగా మరియు నేపథ్య గాయకుడిగా తన ప్రతిభను నిరూపించుకున్నాడు.  హీరోగా నటిస్తూనే తొమ్మిది చిత్రాలకు దర్శకత్వం వహించారు ఉపేంద్ర.  ఇందుకు గాను ఆ చిత్రాలతో ప్రపంచంలోనే అగ్రశ్రేణి దర్శకుల జాబితాలో చేరడం జరిగింది.

ఆ హీరో మరెవ్వరో కాదు కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర. తెలుగు వారికి కూడా సుపరిచితుడైన ఉపేంద్రకు అత్యంత అరుదైన గౌరవం దక్కింది. 50 మంది దర్శకులను ఈ సంస్థ ఎంపిక చేస్తే అందులో 17వ స్థానంను ఉపేంద్ర దక్కించుకున్నాడు. ఇక బాలీవుడ్ ప్రముఖ ఫిల్మ్ మేకర్ రాజ్ కుమార్ ఇరానికి రెండవ స్థానం దక్కింది. ఇక ఇండియన్ దర్శకుల్లో సత్యజిత్ రే కి కూడా జాబితాలో చోటు దక్కింది. మొత్తానికి ఒక హీరో ఈ స్థాయి గౌరవం అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఉపేంద్ర ఫ్యాన్స్ తెగ సంతోషంలో మునిగిపోతున్నారు. 


hero-and-director-upendra
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.