కొన్ని సినిమాలు, కొన్ని పాటలు ప్రేక్షకులకు సినిమా చూసినప్పుడు కంటే   తర్వాత రోజుల్లో బాగా హిట్ అవుతూంటాయి. అంటే.. ఆయా సినిమాలు, పాటలు టీవీల్లో ప్రసారం అయినప్పుడు రేటింగ్స్ వచ్చి అదరహో అనిపిస్తాయి. ప్రస్తుతం అలాంటి కోవలోకే 'రౌడీ బేబీ..' పాట వస్తుంది. యూ ట్యూబ్ లో రౌడీ బేబీ పాట సృష్టిస్తున్న రికార్డులకు హద్దు లేకుండా పోతోంది. రికార్డు వ్యూస్ తో చరిత్ర సృష్టిస్తోంది.

 

ఇప్పటివరకు ఏ భాషలో.. ఏ పాటకు కూడా రాని వ్యూస్ రౌడీ బేబీ పాటకు వచ్చాయి. ఇంకా వస్తున్నాయి కూడా. ఈ పాటకి వచ్చిన వ్యూస్ అక్షరాలా 600 మిలియన్ వ్యూస్. ఇది నిజమా.. కదా అని అనుకున్నా పక్కాగా ఇది నిజమే. ధనుష్ – సాయి పల్లవి కాంబోలో వచ్చిన మారి 2 చిత్రంలోని ఈ రౌడీ బేబీ పాట గతేడాదే సూపర్ హిట్ అయింది. సినిమాగా తమిళ్ లో కూడా యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ పాట బాగా క్లిక్ అయింది. విజువల్ గా వచ్చాక ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంది. ప్రభుదేవా డాన్స్ కంపోజింగ్ కు ధనుష్-సాయి పల్లవి డాన్స్ మూమెంట్స్ తో ఆదరగొట్టారు. ముఖ్యంగా సాయి పల్లవి డాన్స్ ఈపాటలో హైలైట్ అని చెప్పాలి. ప్రభుదేవా కొరియోగ్రఫీలోని గ్రాండియర్ ఈ పాటలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. దీంతో ఈ పాట సూపర్ హిట్ అయింది.

 

సినిమా హిట్ కాకపోయినా రౌడీ బేబీ.. పాట 600 మిలియన్ వ్యూస్ సాధించి వారి కష్టానికి ప్రతిఫలాన్నిస్తోంది. యూ ట్యూబ్ లో రికార్డులు సృష్టించటం ద్వారా ఇటువంటి పాటలు, సినిమాలు ప్రపంచవ్యాప్తంగా వెళ్లి ఒరిజినల్ పాట, సినిమాలకు మరింత గుర్తింపును తెస్తున్నాయి. ఇటీవల అల్లు అర్జున్ నటించిన సరైనోడు సినిమా కూడా 200 మిలియన్ల వ్యూస్ సాధించి రికార్డ్స్ సాధించిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: