టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, దర్శకధీరుడుగా పేరుగాంచిన రాజమౌళి దర్శకత్వంలో 2007లో తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ యమదొంగ. అప్పటివరకు సోషల్ మూవీస్ చేస్తూ వస్తున్న ఎన్టీఆర్, రాజమౌళి, ఇద్దరు కలిసి వినూత్నంగా గతంలో తెలుగులో యముడి బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలను స్ఫూర్తిగా తీసుకుని నేటి పరిస్థితులకు అనుగుణంగా ఒక కల్పిత కథ, కథనాలతో రాజమౌళి ఈ సోషియో ఫ్యాన్టసి సినిమాను తెరకెక్కించడం జరిగింది. 

విశ్వామిత్ర క్రియేషన్స్ బ్యానర్ పై ఊర్మిళ గుణ్ణం, పి చెర్రీ నిర్మాతలుగా నిర్మించిన ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ప్రియమణి, మమతా మోహన్ దాస్ హీరోయిన్స్ గా నటించగా కీలకమైన యముడి పాత్రలో నటప్రపూర్ణ మోహన్ బాబుగారు, చిత్రగుప్తుని పాత్రలో బ్రహ్మానందం గారు ఎంతో అద్భుతంగా నటించారు. అంతేకాక ఈ సినిమాలో గ్రాఫిక్స్, యాక్షన్ సీన్స్ మరియు యముడి కామెడీ సీన్లు ఎంతో ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు దర్శకులు రాజమౌళి. సరిగ్గా 2007 ఆగష్టు 15 నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, తొలిరోజు తొలి ఆట నుండి సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుని, అప్పట్లో పలు బాక్సాఫీస్ రికార్డులను కూడా నెలకొల్పడం జరిగింది. 

అయితే అప్పటివరకు బాగా బొద్దుగా ఉన్న ఎన్టీఆర్, ఈ సినిమా ద్వారానే బాగా సన్నబడి అభిమానులను తన డ్యాన్స్ మూమెంట్స్ తో మరింతగా ఉర్రూతలూగించారు. ఇకపోతే ఈ సినిమా రిలీజ్ అయి నేటితో పన్నెండేళ్ళు గడిచిన సందర్భంగా పలువురు ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఈ సినిమా హ్యాష్ ట్యాగ్ తో నేడు పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో హడావుడి చేస్తున్నారు. ఇక ఎడిటింగ్, మేకప్, కాస్ట్యూమ్ డిజైనింగ్, స్పెషల్ ఎఫెక్ట్స్ వంటి నాలుగు విభాగాల్లో ఈ సినిమా నంది పురస్కారాలను గెలుచుకుంది. ఇకపోతే హీరో ఎన్టీఆర్ కు ఉత్తమ నటుడిగా ఫిలిం ఫేర్, సిని 'మా' అవార్డులను ఈ చిత్రం తెచ్చిపెట్టింది.....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: