సినిమా.. సినిమా.. సినిమా.. ప్రపంచంలో బలమైన మీడియాలో ఇది ఒకటి. రంగుల ప్రపంచం.  ఇందులో ఎదగాలని, ఒదగాలని చాలామందికి ఉంటుంది.  కొందరికే అవకాశం దొరుకుతుంది.  దొరికిన ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న వ్యక్తులు గొప్పవాళ్లుగా ఎదురుగారు.  చేజార్చుకున్న వ్యక్తులు పాతాళానికి పడిపోతారు.  మెగాస్టార్ చిరంజీవి చాలా కష్టపడి వరసగా మెగాస్టార్ గా ఎదిగాడు.
  
మెగాస్టార్ చూపించిన దారిలో మిగతా వారందరు నడవడం మొదలుపెట్టారు.  చిరు తనయుడు రామ్ చర్మం ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోల్లో ఒకరు.  చరణ్ 12 సినిమాలు చేసారు.  అందులో 11 వ సినిమా రంగస్థలం సినిమా  నటన అద్భుతంగా ఉంటుంది.  అలాంటి నటన కోసమే ఫ్యాన్స్ ఎదురుచూశారు.  



మాస్ ఫైట్స్ అందరు చేస్తారు.  కానీ పక్కా అద్భుతమైన నటన కొందరికే సాధ్యం అవుతుంది.  అది రంగస్థలం సినిమాతో రామ్ చరణ్ కు దొరికింది.  ఇలాంటి నటన కోసం 11 సినిమాల వెయిట్ చేయాల్సి వచ్చింది.  వరుణ్ తేజ్ ఇందుకు డిఫరెంట్ గా ఉన్నాడు.  ముకుందా సినిమాతో వెండితెరకు పరిచయమయ్యి.. తరువాత మంచి హిట్స్ తో దూసుకుపోతున్న ఈ హీరో.. ఇప్పుడు హరీష్ శంకర్ తో వాల్మీకి చేస్తున్నాడు.  



తమిళంలో సూపర్ హిట్టైన జిగర్తాంట సినిమాకు రీమేక్.  ఇందులో వరుణ్ తేజ్ నెగెటిక్ టచ్ ఉండే పాత్రలో నటిస్తున్నాడు.  ఉంగరాల జుట్టు గుబురు గడ్డంతో భయంకరంగా ఉన్నాడు. పోస్టర్స్ లోనే వావ్ అనిపించిన వరుణ్ తేజ్..లుక్ పరంగానే కాకుండా యాక్టింగ్ పరంగా కూడా వావ్ అనిపించారు.  ఒక విధంగా చెప్పాలి అంటే రామ్ చరణ్ రంగస్థలంలో చూపించిన యాక్టింగ్ కు మించేలా ఉన్నది వరుణ్ యాక్టింగ్.  సినిమా మొత్తం ఇదే తరహా యాక్టింగ్ కనబరిస్తే.. సినిమా సూపర్ హిట్ కావడం ఖాయం అని చెప్పొచ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి: