తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి స్వయంకృషితో తనకంటూ ఓ సామ్రాజ్యాన్నే సృష్టించుకున్నాడు. ఎంతగా అంటే.. తాను కష్టపడి వేసిన బాటలో తన కుటుంబం నుంచే అరడజనుకు పైగా హీరోలు వచ్చేంతగా. చిరంజీవిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్లెందరో ఉన్నారు. చిరంజీవిని చూసే ఇండస్ట్రీకి రాకపోయినా.. చిరంజీవిని ఆదర్శంగా తీసుకున్న ఓ తెలుగు సూపర్ స్టార్ కూడా ఉన్నాడంటే ఆశ్చర్యమే.


 

ఆ సూపర్ స్టార్ మరెవరో కాదు.. అక్కినేని నాగార్జున. 73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జరిగిన ఓ మీడియా ఇంటరాక్షన్ లో యాంకర్ అడిగిన ప్రశ్నకు కింగ్ ఇలా సమాధానమిచ్చాడు. మీ నాన్నగారు కాకుండా మీకు ఇన్ స్పిరేషన్ ఇచ్చిన నటులు ఎవరైనా ఉన్నారా అని అడగ్గానే.. “నేను చేసిన విభిన్నమైన పాత్రలకు స్ఫూర్తి నాన్నగారే. ఆయన్ను చూసే అన్ని రకాల క్యారెక్టర్లు ఎలా చేయాలో తెలుసుకున్నా. ఆయన కాకుండా చిరంజీవి గారిని చూసి కూడా ఇన్ స్పైర్ అయ్యాను. చిన్న చిన్న క్యారెక్టర్ల స్థాయి నుంచి హీరోగా అటుపై మెగాస్టార్ గా ఎదిగిన తీరు నిజంగా ఆదర్శనీయమే ” అని సూటిగా సమాధానమిచ్చాడు. నాగ్ ఇచ్చిన ఆన్సర్ నిజమే. హేమాహేమీలున్న టైమ్ లో ఓ నటుడిగా వచ్చి తన డైనమిక్ మేనరిజమ్ తో మాస్ హీరోగా అశేషమైన అభిమానగణాన్ని సంపాదించుకున్న చిరంజీవి గురించి ఎవరెంత చెప్పినా తక్కువే.



ఎందరో నటులు, టెక్నీషియన్లు తాము చిరంజీవి చూడటానికి ఇండస్ట్రీకి వచ్చి ఆయన్ను ఆదర్శంగా తీసుకుని పైకొచ్చామని చెప్తూంటారు. చిరంజీవిని ఆదర్శంగా తీసుకున్న మెగా కుటుంబ హీరోలు కూడా ఆయన పేరు చెడగొట్టకుండా తమకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకుంటున్నారు. ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలని ప్రతిఒక్కరూ తపించే స్థాయికి చిరంజీవి చేరుకోవడం గొప్ప విషయమే కదా.


మరింత సమాచారం తెలుసుకోండి: