అసలైన సినిమా ఒక్కటి పడితే కానీ.. నటుడిలోని టాలెంట్ ఏంటో పూర్తిగా అర్థం కాదు.. కానీ ఆ అసలైన సినిమా ఒక్కటి పడటం అంత ఈజీ కాదు. ఎన్ని అవకాశాలు వచ్చాయన్నది కాదు.. ఎన్ని నిలబెట్టాయన్నదే ఏ హీరో కెరీర్ లోనైనా ప్రధానం.. ఇప్పుడు వరణ్ తేజ్ కు అలాంటి నిలబెట్టే సినిమా వచ్చేసినట్టే కనిపిస్తోంది.


వాల్మీకి సినిమా టీజర్ చూసిన తర్వాత అదే అనిపిస్తోంది. టీజర్ చివర్లో నాలుగు బుల్లెట్స్‌ సంపాయిత్తే రెండు కాల్చుకోవాలె, రెండు దాచుకోవాలె..' అన్న డైలాగ్ వరుణ్ తేజ్ పలికిన విధానం సినిమా మొత్తాన్ని చెప్పకనే చెబుతోంది. వరుణ్‌తేజ్‌, హరీష్‌శంకర్‌, 14 రీల్స్‌ ప్లస్‌ 'వాల్మీకి' టీజర్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది.


మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ హీరోగా మాస్‌ కమర్షియల్‌ సినిమాల దర్శకుడు హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న లేటెస్ట్‌ మూవీ వాల్మీకి. ఇటీవల తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన జిగర్తాండ అనే సినిమాకు ఇది అఫీషియల్‌ రీమేక్‌. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ టీజర్‌ ను స్వతంత్ర దినోత్సవ కానుకగా ఆగష్టు 15న రిలీజ్‌ అయ్యింది. 'నా సినిమాలో విలనే నా హీరో' అంటూ అధర్వ చెప్పే డైలాగ్‌తో టీజర్‌ స్టార్ట్‌ అవుతుంది. వరుణ్‌ స్టైలిష్‌ లుక్‌తో గ్యాంగ్‌స్టర్‌గా కనిపిస్తున్నాడు. సిగరెట్‌ తాగుతూ వరుణ్‌ నడుస్తూ వచ్చే సీన్‌ బాగుంది.


టీజర్‌ చూస్తుంటే యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ఈ సినిమాకు హైలెట్‌గా నిలువనున్నాయని తెలుస్తుంది. 51 సెకండ్ల నిడివిగల టీజర్‌ చూస్తుంటే సినిమా ఎప్పుడు రిలీజ్‌ అవుతుందా అనే ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేశారు దర్శకుడు హరీష్‌ శంకర్‌. వరుణ్‌ ఫస్ట్‌ మూవీ ముకుందలో హీరోయిన్‌ గా నటించిన పూజ హెగ్డే, మరొక్కసారి ఈ సినిమాలో ఆయనతో నటిస్తోంది. ఈ సినిమాను సెప్టెంబర్‌ 13న వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ చేయనున్నారు. మొత్తం మీద వాల్నీకి టీజర్ చూస్తుంటే.. ఇది వరుణ్ తేజ్ రంగస్థలమేమో అనిపించక మానదు.


మరింత సమాచారం తెలుసుకోండి: