హిందీ చిత్రసీమలో రియల్ స్టోరీస్ కి ఆదరణ ఎక్కువ. నిజ జీవితగాధలు, సంఘటనలతో వచ్చిన ఎన్నో సినిమాలు చాలా వరకు హిట్ అయ్యాయి. ఆయా సినిమాలకు క్రేజ్, సక్సెస్ రేట్ కూడా ఎక్కువ ఉండటంతో నిర్మాతలు, దర్శకులు, హీరోలు కూడా ఆయా జోనర్ సినిమాలపై ఇంట్రెస్ట్ చూపిస్తూంటారు. తాజాగా బాలీవుడ్ లో అలాంటి జోనర్ తో తీసిన సినిమా మంగళయాన్ హిట్ టాక్ తెచ్చుకుంది.


 

2013 నవంబర్ 5న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అంగారకుడిపైకి ప్రయోగించిన మంగళయాన్ ఆధారంగా తెరకెక్కిన ‘మిషన్ మంగళ్ ’సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. నిన్న దేశవ్యాప్తంగా రిలీజైన ఈ సినిమాకు క్రిటిక్స్, ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమాను కొత్త దర్శకుడు జగన్ శక్తి తెరకెక్కించాడు. ఆమధ్య రిలీజైన టీజర్ తోనే సినిమాకు హైప్ వచ్చింది. మంగళయాన్ ను ప్రయోగించేందుకు శ్రమించిన సైంటిస్టుల కృషిని ఈ సినిమాలో చూపించారు. సినిమాలో కంటెంట్ ని రియలిస్టిక్ గా చూపించడంతో సినీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీనిపై బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ కూడా ట్వీట్ చేశాడు. ‘ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా అద్భుతం. అక్షయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్. మౌత్ టాక్ తో ఈ సినిమా భారీ కలెక్షన్లు సాధించబోతోంది’ అంటూ ట్వీట్ చేశాడు.

 


విద్యాబాలన్, సోనాక్షి సిన్హా, తాప్పీ, నిత్యామీనన్.. వంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమా 2019 లో బెస్ట్ మూవీ అవుతుందని క్రిటిక్స్ అంటున్నారు. మంగళయాన్ ను మామ్ గా (మాస్ ఆర్బిటర్ మిషన్) కూడా పిలుస్తారు. మంగళయాన్ ఎంత విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిందో ఇప్పుడు ఈ సినిమా కూడా అంతే విజయం సాధించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: