దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో రామ్ చరణ్, ఎన్టీయార్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, ఎన్టీయార్ కొమరమ్ భీమ్ పాత్రలో నటిస్తున్నారు. కొన్ని రోజుల క్రిందట రామ్ చరణ్ కియారా అద్వానీ పుట్టిన రోజు సందర్భంగా ఆమెను కలిసాడు. రామ్ చరణ్, కియారా కలిసిన సమయంలో వీరిద్దరూ మీడియా కంట పడటంతో రామ్ చరణ్ లుక్ లీకైంది. 
 
అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ లుక్ ఎలా ఉంటుందో ప్రేక్షకులు ఒక అంచనాకు వచ్చేసారు. మరోవైపు కొమరమ్ భీమ్ పాత్రలో ఎన్టీయార్ ఫస్ట్ లుక్ ఆగస్ట్ 14 వ తేదీ సాయంత్రం 4 గంటల 50 నిమిషాలకు విడుదల చేస్తారని వార్తలు వచ్చాయి. ఎన్టీయార్ ఫ్యాన్ ఎవరో కావాలని ఒరిజినల్ పోస్టర్ ఎలా ఉంటుందో అదే విధంగా ఆర్ ఆర్ ఆర్ యూనిట్ ఫస్ట్ లుక్ విడుదల చేయబోతుందని సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ఈ పోస్ట్ నిజమేనని నమ్మి చాలా మంది సోషల్ మీడియాలో షేర్ చేయటంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. 
 
ఇప్పటికే రామ్ చరణ్ లుక్ లీక్ అవటంతో రామ్ చరణ్ పై రాజమౌళి అసహనం వ్యక్తం చేస్తున్నాడని తెలుస్తోంది. ఎన్టీయార్ కు కొమరమ్ భీమ్ లుక్ లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకోమని రాజమౌళి సూచించాడని సమాచారం. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో రామ్ చరణ్ సరసన అలియా భట్ నటిస్తుండగా ఎన్టీయార్ కు హీరోయిన్ ఇంకా ఫైనల్ కావాల్సి ఉంది. హీరోయిన్ లేకుండానే ఎన్టీయార్ కు సంబంధించిన కొంత భాగం షూటింగ్ చేసినట్లు తెలుస్తోంది. 
 
ఆర్ ఆర్ ఆర్ సినిమాను 2020 సంవత్సరంలో జులై 30 వ తేదీన విడుదల చేయబోతున్నారు. సినిమా విడుదలకు ఇంకా చాలా సమయం ఉండటంతో రాజమౌళి పబ్లిసిటీ ఆలస్యంగా చేస్తాడని సమాచారం అందుతోంది. చరిత్ర ప్రకారం అల్లూరి సీతారామరాజు, కొమరమ్ భీమ్ కలవకపోయినా వీరిద్దరూ కలిసి పోరాటం చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో రాజమౌళి ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు సమాచారం. 



మరింత సమాచారం తెలుసుకోండి: