మన్మథుడు వంటి క్లాస్.. సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ అంటు మన్మథుడు-2 ని తీసి ఎంత చెడగొట్టాలో అంతా చెడగొట్టాడు డైరెక్టర్. చేసిందే బూతు పని, మళ్లీ దాన్ని సిగ్గులేకుండా సమర్థించుకుంటున్నాడు. రాహుల్ రవీంద్రన్ కి అసలు బుర్ర. బుద్ధి ఉన్నాయా అంటున్నారు నాగ్ ఫ్యాన్స్. ముఖ్యంగా లేడి ఫ్యాన్స్. గొప్ప తెలుగు భాషను వాడి..మన్మథుడు-2లో పచ్చి బూతుల్ని విచ్చలవిడిగా వాడిన ఈ దర్శకుడు విమర్శల పాలైన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాత్రం రాహుల్ తనను తాను సమర్థించుకున్నాడు. తను తెలుగుకు అత్యథిక ప్రాధాన్యం ఇచ్చానని, ప్రేక్షకులు మాత్రం అందులో బూతులు మాత్రమే చూస్తున్నారని తెగ ఫీలైపోయాడు.  

మన్మథుడు-2 సినిమాలో ఓ సన్నివేశంలో లవణం అనే పదం ఉంటుంది. ఈ పదాన్ని వెన్నెల కిషోర్ సాయంతో ఎంత బూతుగా మార్చాలో అంతగా మార్చేశాడు. ఇది కేవలం చిన్న ఉదాహరణ మాత్రమే. "నువ్వు ఇప్పటివరకు నీ తుపాకి వాడలేదు" అంటూ నాగార్జున వెన్నెల కిషోర్ తో చెప్పిన డైలాగ్స్ లాంటివి తెలుగంటూ రాహుల్ రవీంద్రన్ సమర్థించుకుంటున్నాడు.  అందులో ఎంత బూతు ఉందో అర్థం చేసుకోలేనంత అమాయకులు కాదు తెలుగు ప్రేక్షకులు. కాలేజీ స్టూడెంట్స్ అయితే సగం మాట పూర్తికాక ముందే దానర్థం ఏంటో చెప్పేస్తారు.

ఎటూ సినిమాని నాశనం చేశాడు. సినిమాలో భాగంగానే అలా చేశాననో, ఆ కథకు అలాంటి డైలాగులు మాత్రమే ఉండాలనో చెప్పుకుంటే సరిపోయేది. అలా సమర్థించుకోకుండా తెలుగు భాషోద్ధారణ అంటూ కొత్తగా ఇతనే కనిపెట్టినట్టు మాట్లాడుతున్నాడు రాహుల్ రవీంద్రన్. అంతేకాదు అచ్చమైన తెలుగు భాష వాడిన సినిమా ఇదేనని బొంకుతున్నాడు. ఇలాంటి పిచ్చి కూతలు కూస్తే ప్రేక్షకులకు మండిపోతుంది కదా.. రిలీజైన మూడో రోజుకే మన్మథుడు-2 తట్టా బుట్టా సర్ధేసింది. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో ఉందంటే ఉంది. అంతే తప్ప దానికి వసూళ్లు వస్తున్నట్టు ఏ ఒక్క చోటా కనపడటం లేదు . అందుకే ప్రమోషనల్ టూర్ ను కూడా రద్దుచేసిన నాగార్జున 'ఇదేం ఖర్మ రా బాబు' అంటూ ఫీలవుతున్నారట. 


మరింత సమాచారం తెలుసుకోండి: