బాలీవుడ్ హాట్ హీరోయిన్ ప్రియాంక చోప్రా వివాహం చేసుకున్నాక అమెరికా వెళ్లి అక్కడ సెటిల్ అయ్యింది.  ప్రియాంక చోప్రా భర్త  నిక్ జోనస్ హాలీవుడ్ పాప్ సింగర్.  ఒకరు హీరోయిన్.. మరొకరు పాప్ సింగర్.  ఇద్దరికీ మంచి సంపాదన ఉన్నది.  డబ్బుకు లోటు లేదు.  అయితే, ఇద్దరు అమెరికాలో ఉంటున్న పాత ఇంటిని ఇటీవలే అమ్మేశాడు నిక్.  6.5 మిలియన్ డాలర్లతో గతంలో కొనుగోలు చేసిన నిక్, 6.9 మిలియన్ డాలర్లు అమ్మేశాడు. 


కాగా, ఇప్పుడు కొత్త ఇంటికోసం వెతుకులాట మొదలుపెట్టారు.  దాదాపు 20 మిలియన్ డాలర్లతో కొత్త ఇంటిని తీసుకోవాలని చూస్తున్నాడు నిక్.  ఇద్దరి సంపాదన సంవత్సరానికి కనీసం 40 మిలియన్ డాలర్లకు పైగా ఉన్నది.  పైగా వివాహం జరిగింది కాబట్టి చిన్న ఇంట్లో ఉంటె ఇరుగ్గా ఉంటుంది.  సెలెబ్రిటీలు కాబట్టి ఇంటికి అభిమానుల తాకిడి ఉంటుంది. 


అందుకోసమే నిక్ ఈ నిర్ణయం తీసుకున్నారట.  త్వరలోనే కొత్త ఇంటికి చూసి అందులోకి షిఫ్ట్ అవుతారని సమాచారం.  20 మిలియన్ డాలర్లు అంటే దాదాపుగా రూ. 141 కోట్లు.  ఇంత డబ్బు పెట్టి ఇల్లు కొనడం అవసరమా అంటే.. ఖచ్చితంగా అవసరమే అని అంటున్నారు.  డబ్బు సంపాదన ఉన్నది ఏదైనా కొనేందుకు సిద్ధం అవుతున్నారు.  


ప్రస్తుతం ప్రియాంక చోప్రా బాలీవుడ్ లో ది స్కై ఈజ్ పింక్ సినిమా చేస్తున్నది.  అటు హాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నది.  హాలీవుడ్ సినిమా రంగంలోనే సెటిల్ అయ్యేందుకు ప్రియాంక చోప్రా ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం.  ఎక్కడ ఉన్నా సరే తాను మొదట భారతీయురాలినే అని ఇటీవలే చెప్పింది.  పాక్ మహిళా అడిగిన ప్రశ్నకు ఈ విధమైన సమాధానం చెప్పింది.  మూలాలు మర్చిపోకుండా ఉంటె మంచిది కదా.  


మరింత సమాచారం తెలుసుకోండి: