మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శీనివాస్ తన సినిమాలలో పంచ్ లు ప్రాసలే కాదు టైటిల్ విషయంలో కూడా చాలా కొత్తగా ఆలోచిస్తారు. అంతేకాదు అందరికి అర్థమయ్యోలా టైటిల్ ని ఫిక్స్ చేయడంలో కూడా గురూజీని ఎవరితో పోల్చలేము. ఇలా ఎప్పటి కప్పుడు ఓ డిఫరెంట్ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకొచ్చే త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమాకు కూడా అదే విధంగా తనదైన స్టైల్ లో టైటిల్ ను ఫిక్స్ చేసుకున్నారు. అల్లు అర్జున్ తో తెరకెక్కిస్తున్న సినిమాకు 'అల వైకుంఠపురములో' అనే టైటిల్ ఫిక్స్ చేసుకున్నారు. ఆగస్టు 15 న టైటిల్ ను రివీల్ చేస్తూ బన్నీ క్యారెక్టర్ ఎలా ఉండబోతోందో రివీల్ చేశారు. అయితే ఈ టైటిల్ రెండు రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిందే. అదే టైటిల్ ను ఇప్పుడు అఫీషియల్ గా అనౌన్స్ చేశారంతే. దాంతో అటు బన్ని ఫ్యాన్స్ లో గానీ, ప్రేక్షకుల్లోగానీ పెద్దగా ఆసక్తి కనపడలేదు.

ఈ మధ్య త్రివిక్రమ్ ప్రతీ సినిమాకు ఇలానే జరుగుతుందన్న విషయం ఇప్పుడు అన్ని చోట్లా ఒక హాట్ టాపిక్ అవుతుంది. సోషల్ మీడియాలో టైటిల్ ముందే ఎందుకు..ఎలా లీకవుతుంది...అని చాలా మంది ఆరా తీస్తున్నారు. అత్తారింటికి దారేది - అఆ- అజ్ఞాత వాసి ఇప్పుడు 'అల వైకుంఠపురములో'. వాస్తవంగా ఒక సినిమా టైటిల్ ఏదన్నా బయటికొస్తే ఇది కాదేమో అనుకుంటాం. అంతేకాదు నమ్మే అవకాశాలు కూడా చాలా తక్కువే.  కానీ త్రివిక్రమ్ సినిమా టైటిల్ బయటికొస్తే మాత్రం ఖచ్చితంగా నమ్మితీరాల్సిందే. ఎలాగో అనౌన్స్ చేసేది ఆ టైటిల్ నే కాబట్టి నమ్మక తప్పదు. ఇప్పుడు బన్నీ-త్రివిక్రమ్ సినిమాకి కూడా అదే జరిగింది. టైటిల్ ఇదే అని రెండు రోజుల ముందే ఫ్యాన్స్ ఫిక్సయిపోయారు.

అయితే త్రివిక్రమ్ సినిమాకే ఎందుకిలా జరుగుతుందనేది ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో చర్చించుకుంటున్నారట. పెద్ద సినిమాకు సంబంధించి ప్రతీ చిన్న విషయాన్ని చాలా సీక్రెట్ గా ఉంచుతారు దర్శక నిర్మాతలు. కానీ త్రివిక్రమ్ సినిమా విషయనికొచ్చే సరికీ అది రివర్స్ అవుతుంది. తన టైటిల్ క్లిక్ అవుతుందా..? ఆ హీరో అభిమానులకు నచ్చుతుందా..? లేదా అని త్రివిక్రమే టైటిల్ రివీల్ కి కొన్ని రోజుల ముందు ఇలా లీక్ చేస్తున్నాడా..? అనే సందేహం కూడా ప్రేక్షకులకు వస్తోంది. మొత్తానికి మాత్రం 'అల వైకుంఠపురములో' అన్న టైటిల్ జనాలకి బాగానే కనెక్ట్ అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: