టాలీవుడ్  చరిత్రలో ఇప్పటి వరకు ఎప్పుడు జరగని విధంగా కేవలం 32 రోజులలో రెండు భారీ బడ్జెట్ సినిమాలు కౌంట్ డౌన్ మొదలైంది. ప్రేక్షకులకు అతి పెద్ద విజువల్ ఫీస్ట్ ఇవ్వడానికి ‘సాహో’ ‘సైరా’ లు రెడీ అవుతున్నాయి. ఈ రెండు సినిమాల పై 800 కోట్ల వరకు బిజినెస్ అవుతున్న నేపధ్యంలో ఈ రెండు మూవీల బయ్యర్లు నష్టాలు లేకుండా గట్టెక్కాలి అంటే ఈ రెండు సినిమాలకు ఖచ్చితంగా 1000 కోట్లు వచ్చితీరాలి.

దీనితో ‘సాహో’ సైరా’ మూవీలలో ఏ మూవీ చరిత్ర సృష్టిస్తుంది లేకుంటే ఈ రెండు సినిమాలు విడివిడిగా తమతమ స్థాయిలలో చరిత్ర సృష్టిస్తాయా అన్న అంచనాలు మొదలైపోయాయి. దీనికితోడు ఈ రెండు సినిమాలను భారీ సినిమాలు తీయడంలో అనుభవంలేని సుజిత్ సురేంద్ర రెడ్డిలు దర్శకత్వం వహించడంతో ఈ మూవీల ఫలితం పై అత్యంత ఆసక్తి నెలకొని ఉంది. 

దీనికితోడు బాలీవుడ్ మార్కెట్ లో ప్రభాస్ చిరంజీవిలకు చెప్పుకోతగ్గ ఇమేజ్ లేదు. ‘బాహుబలి’ తో నేషనల్ స్టార్ అయినప్పటికీ ఆ ఇమేజ్ అంతా ఎక్కువగా రాజమౌళి ఖాతాలకి వెళ్ళిపోయింది. దీనికితోడు ప్రభాస్ చిరంజీవిలకు ఉత్తర భారత ప్రాంతంలో చెప్పుకోతగ్గ స్థాయిలో అభిమానులు లేరు. ఇప్పటి వరకు దక్షిణాది ప్రాంతం నుండి హిందీ సినిమా రంగంలోకి వెళ్ళి కమలహాసన్ రజినీకాంత్ లు హిట్స్ సాధించినా గతంలో వారి సినిమాలకు ఈ స్థాయిలో భారీగా ఖర్చు పెట్టలేదు. 

ఇలాంటి పరిస్థితులలో ప్రభాస్ చిరంజీవిల మ్యానియా ఎంతవరకు బాలీవుడ్ లో పనిచేస్తుంది అన్న విషయమై వీరిద్దరి సినిమాల భారీ సక్సస్ ఆధారపడి ఉంటుంది. ప్రభాస్ చిరంజీవిలకు తెలుగు రాష్ట్రాలలో లక్షల స్థాయిలో వీరాభిమానులు ఉన్నా తమిళ కన్నడ మళయాళ ప్రేక్షకులలో వీరి పట్ల చెప్పుకోతగ్గ మ్యానియా లేదు. దీనితో జాతీయ స్థాయిలో ఒక మ్యానియాను సృష్టించి 1000 కలెక్ట్ చేయగల శక్తి ‘సాహో’ ‘సైరా’ లకు లేకుంటే భవిష్యత్ లో వీరిద్దరూ ఇలాంటి భారీ ప్రయోగాలు చేయడానికి ముందుకు రాకపోవచ్చు. ఈ రెండు సినిమాల ఫలితాన్ని బట్టి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ భవిష్యత్ వ్యూహాలు ఉంటాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి: