బిగ్ బాస్ లో హౌస్ లో ఎంత స్నేహంగా ఉన్నా ఒక్కోసారి స్నేహం కూడా శతృత్వం గా మారే అవకాశం ఉంది. హౌస్ లో మనుషుల మధ్య పొరపొచ్చాలు రావడం అనేది చాలా సహజమైన అంశం.గురువారం జరిగిన ఎపిసోడ్ లో ఇలాంటి సంఘటనే జరిగింది. వితికా, పునర్నవి లు ఎప్పటినుండో స్నేహంగా ఉంటున్నారు. టాస్క్ అయినా, ఏదైనా వారు స్నేహంగానే కనిపిస్తున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో వితికా పునర్నవిపై నోరు పారేసుకుంది.


కిచెన్ లో పని చేస్తున్న పునర్నవి గురిమ్చి రాహుల్ తో మాట్లాడింది. పునర్నవి కిచెన్ లో ఉన్నప్పుడు అథారిటేటివ్ గా ఉంటుందట. ఏదైనా చేయడానికి వెళ్తే అలా ఎందుకు చేస్తున్నావ్ ,ఇలా ఎందుకు చేస్తున్నావ్ అంటూ ఆరాలు తీస్తుందట. పునర్నవి అలా మాట్లాడటం వితికాకి నచ్చలేదని, అందుకే పునర్నవి కిచెన్ లో ఉన్నప్పుడు తను అటు వైపే వెళ్ళనని చెప్పింది. అంతే కాకుండా వరుణ్, వితికాలు కిచెన్ లో ఏదో పని చేస్తున్నప్పుడు, పునర్నవి వచ్చి మీరిద్దరు ఇక్కడే ఉంటే నేను వెళ్ళిపోతా అని అందట.


ఈ విధంగా కిచెన్ లో తన బిహేవియర్ ఉంటుందని, దాని వల్ల వితికాకి ఇరిటేషన్ కలుగుతుందని తెలిపింది. అయితే బిగ్ బాస్ లో ఎవరి గేమ్ వారు ఆడుతున్నారు. అందరూ గేమ్ గెలవడానికే వచ్చారు. అందుకే ఎంత స్నేహంగా ఉన్నా ఇటువంటి చిన్న చిన్న వాగ్వాదాలు జరుగుతాయి. ఇవి చిన్నగా ఉంటే ఎటువంటి సమస్యలుండవు.  చిన్న చిన్నవే ఏదో ఒకరోజు పెద్ద గొడలుగా మారే ప్రమాదం ఉంది. ఈ రోజు వితికా బయటపడ్డట్టే పునర్నవి కూడా ఏదో ఒకరోజు బయట పడుతుండవచ్చు.  మరి వీరిద్దరు చివరి వరకు స్నేహంగానే ఉంటారా? లేక ఏమైనా గొడవలు జరుగుతాయా? అనేది ఆసక్తికరంగా మారింది.



మరింత సమాచారం తెలుసుకోండి: