ఆయన డేరింగ్ అండ్ డేషింగ్ డైరెక్టర్. ఆయన సినిమాల టైటిల్సే చాలా సెన్సేషన్. ఆయన హిట్లు, ఫట్లు పట్టించుకోరు. సినిమాలు తీయడం వరకే తన బాధ్యత అన్నట్లుగా ఉంటారు. ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా సరే ఆయన హవా మాత్రం తగ్గడంలేదు. ఇప్పటికి రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉంటూ తనదైన దూకుడు చాటుతున్నారు.


ఆయనే  పూరీ జగన్నాధ్. పూరీ లేటెస్ట్ గా పెద్ద  హిట్ కొట్టారు. ఇస్మార్ట్ శంకర్ మూవీతో పూరీ మళ్ళీ లైం లైట్ లోకి వచ్చేశారు. ఇపుడు ఆయన కొత్త సినిమా కూడా వెరీ ఇంటరెస్టింగ్ కాంబో. రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో పూరీ న్యూ  ప్రాజెక్ట్ సెట్ అయింది. దాంతో పూరీ దీన్ని కూడా టాప్ హిట్ చేసేందుకు రెడీ అయిపోతున్నారు.


మరో వైపు కొడుకు ఆకాశ్ రొమాంటిక్ టైటిల్ తో ఓ కొత్త  మూవీని చేస్తున్నాడు. ఆయన హీరోగా నిలిచేందుకు గెలిచేందుకు తన మార్క్ కష్టాలు తాను పడుతున్నాడు. పూరీ కూతురు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ మీద పాషన్ పెంచుకుంది. ఆమె పేరు పవిత్ర. తండ్రిలాగ  డైరెక్టర్ అవుతుందని అనుకున్నారంతా. డైరెక్షన్ డిపార్టెమెంట్ లో కూడా ఆమె   పనిచేసింది కూడా.


మరో వైపు హీరోయిన్ ఫీచర్స్ కూడా ఈ అమ్మాయికి బాగా ఉన్నాయని కూడా ఫిల్మ్ క్రిటిక్స్ అంచనా వేశారు. కానీ ఇపుడు అందరి అంచనాలు తల్లకిందులు చేస్తూ పూరీ  తనయ ప్రొడ్యూసర్ అవతారం ఎత్తబోతోంది. అదీ తన అన్నయ్య అకాశ్ మూవీతోనే నిర్మాత కావాలనుకుంటోంది. అంటే అన్నయ్య హీరో చెల్లెలు నిర్మాత అన్నమాట. బాగా ఉంది. మరి అదే ఫ్యామిలీలో టాప్ డైరెక్టర్ గా పూరీ ఉన్నారు. ఈ ముగ్గురూ కలిస్తే బ్లాక్ బస్టర్ హిట్ మూవీ రాదా మరి. చూడాలి పూరీ వీరితో జాయిన్ అవుతారో లేదో.


మరింత సమాచారం తెలుసుకోండి: