ఇటీవల కేంద్ర ప్రకటించిన  జాతీయ అవార్డుల్లో ఉత్తమ సినిమా , ఉత్తమ హీరో , ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకున్న బాలీవుడ్ చిత్రం అంధధూన్.   గత ఏడాది బాలీవుడ్ లో విడుదలై బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది ఈ కామెడీ క్రైమ్ థ్రిల్లర్.   శ్రీరామ్ రాఘవన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా , టబు , రాధికా ఆప్టే ముఖ్య పాత్రల్లో నటించారు.   



ఈ చిత్రంఇప్పుడు  కోలీవుడ్ లో రీమేక్ కానుంది. కాగా  ఈ రీమేక్ లో ధనుష్ కానీ సిద్దార్ద్ కానీ హీరోగా  నటించనున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఈసినిమాను ఇప్పుడు సీనియర్ హీరో ప్రశాంత్ రీమేక్ చేస్తున్నాడు.  ఆయన తండ్రి , ప్రముఖ నిర్మాత త్యాగరాజన్  అంధధూన్ రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నాడు. 
 కాగా ఈసినిమా కు ఇంకా దర్శకుడు , మిగతా నటీనటులను ఎంపిక చేయాల్సి వుంది.  వచ్చెనెల నుండి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. 



ఇక ఈ చిత్రం ఈ ఏడాది సమ్మర్లో  ' పియానో ప్లేయర్' అనే  టైటిల్ తో   చైనా లో విడుదలై బాక్సాఫీస్ ను షేక్ చేసింది.  పాజిటివ్ టాక్ తో  ఈచిత్రం అక్కడ  200కోట్లకు పైగా  వసూళ్లను రాబట్టి సంచనలన విజయాన్ని సాధించింది.  దాంతో ఈ చిత్రం అక్కడ  అత్యధిక గ్రాస్ వసూళ్లను రాబట్టిన 4వ భారతీయ సినిమాగా రికార్డు సృష్టించింది. ఇక అంధధూన్ ను ప్రస్తుతం  తెలుగులో కూడా రీమేక్ చేయడానికి  ప్రయత్నాలు జరుగుతున్నాయి. టాలీవుడ్ బడా నిర్మాతల్లో ఒకరు ఈ రీమేక్ ఫై ఆసక్తి చుపిస్తున్నట్టుగా సమాచారం.  మరి ఈ రీమేక్ కు ఏ హీరో ఓకే చెప్తాడో  చూడాలి. త్వరలోనే   ఈరీమేక్ గురించి ప్రకటన వెలుబడే అవకాశాలు ఉన్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: