శ్రధ్ధా కపూర్ ఈ పేరు ఇపుడు సౌత్ లో మారుమోగుతోంది. ఏ బాలీవుడ్ ముద్దుగుమ్మ సాహోలో మురిపిస్తోంది. మైమరపిస్తోంది. దాదాపుగా 300 కోట్ల పై చిలుకు బడ్జెట్ తో హాలీవుడ్ స్థాయిలో తీసిన సాహో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రెస్టేజియస్ మూవీ. బాహుబలి తరువాత సుదీర్ఘ విరామం తరువాత వస్తున్న మూవీ ఇది. దాంతో అంచనాలు భారీగా ఉన్నాయి.


ఈ మూవీలో ప్రభాస్ కి కోడీగా శ్రధ్ధా కపూర్ నటించింది. ఈ జోడీ బెస్ట్ అంటున్నారు ఫిల్మ్ క్రిటిక్స్. రోమాంటిక్ ఫోజుల్లో ఇద్దరూ  సరి సాటిగా నిలిచారు. యాక్షన్ థ్రిల్లర్ గా ఉన్న సాహోలో రోమాన్స్ కి కూడా లోటు లేదుట. అందుకు శ్రధ్ధ కపూర్ సాక్ష్యం అంటున్నారు. అందాలను ఆరబోస్తూ శ్రధ్ధ ప్రభాస్ తో స్క్రీన్ చేసుకున్న తీరుకు యూత్ ఫిదా అవుతున్నారు.


ఈ మూవీ టీజర్లలో కూడా శ్రధ్ధ అందాలను  ఓ స్థాయిలో శ్రధ్ధగా చూపిస్తున్నారు. బాక్సాఫీస్ సక్సెస్ ఎలిమెంట్ గా శ్రధ్ధను వాడుకుంటున్నారని తెలుస్తోంది. ఈ మూవీ మరో పదిహేను రోజుల్లో సెట్స్ మీదకు వస్తుంది. బాగానే ఉంది. ఈ మూవీ హిట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. హీరోయిన్  శ్రధ్ధ కపూర్ మీద ఇపుడు అందరి కన్ను ఉంది. ఆ అమ్మడుని తమ మూవీస్ లో నటింపచేయాలని సౌత్ నుంచి పెద్ద ప్రయత్నమే జరుగుతోంది. 


ముఖ్యంగా టాలీవుడ్లో శ్రధ్ధకు రెడ్ కార్పెట్ రెడీ అయింది. కానీ శ్రధ్ధ కొత్త ప్రాజెక్ట్ టాలీవుడ్ కి ఒప్పుకుంటుందా అన్నదే డౌట్. ఆమె రెమ్యునరేషన్  కూడా టాప్ రేంజిలో ఉందని టాక్. ఆమె సాహో హై  బడ్జెట్ మూవీ కాబట్టి చేసింది. మరి టాలీవుడ్లో కోట్లకు కోట్లు పోసి శ్రధ్ధ లాంటి హీరోయిన్ని పెట్టుకుంటారా అన్నది చూడాలి. ఏమైనా సాహో హిట్ అయితే  చాలు, శ్రధ్ధకు ఎన్ని కోట్లు కుమ్మరించేందుకైనా రెడీ అంటున్నారుట కొందరు నిర్మాతలు.


మరింత సమాచారం తెలుసుకోండి: