మూడు వారాల క్రితం ప్రారంభమైన బిగ్ బాస్ షో ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటోంది. మొదటి వారంతో పోలిస్తే రేటింగ్స్ తగ్గినప్పటికీ ప్రేక్షకులు ఈ షోపై బాగానే ఆసక్తి చూపిస్తున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బిగ్ బాస్ ఇంటి సభ్యులు రెండు గ్రూపులుగా ఏర్పడి స్కిట్ చేయమని బిగ్ బాస్ ఆదేశిస్తాడు. మొదట స్త్రీ పురుష సమానత్వం గురించి పునర్నవి, వితిక, అషు రెడ్డి, రవికృష్ణ, మహేశ్ విట్టా, రోహిణి స్కిట్ చేస్తారు. 
 
స్కిట్లో భాగంగా రవి ఫోనులో నవ్వుకుంటూ మాట్లాడతాడు. వితిక కూడా పోన్లో మాట్లాడుతూ ఉంటుంది. రవి వచ్చి ఎవరితో మాట్లాడుతున్నావని అడగగా వితిక కొలీగ్ తో మాట్లాడుతున్నానని సమాధానం ఇస్తుంది. కొలీగ్ తో హ్యాపీగా మాట్లాడుకో అని రవి వెళ్ళిపోతాడు. నీ మీద నమ్మకం పెట్టుకున్నా అది నేను చేసిన తప్పు అని రవి అంటాడు. నమ్మకం గురించి నువ్వు మాట్లాడతావా నువ్వు ఎన్నిసార్లు ఫోన్లో ప్రియతో మాట్లాడినా నేనెప్పుడైనా అడిగానా అంటూ వితిక ప్రశ్నిస్తుంది. 
 
రవి ప్రియతో కాదు 100 మందితో మాట్లడతా అంటాడు. నేను మగాడ్ని ఎలాగైనా ఉంటానని వితికతో అంటాడు. వితిక నేను ఆడదాన్ని నా ఇష్టం వచ్చినట్లుగా నేను మాట్లాడతా అని సమాధానం చెబుతుంది. మహేశ్ విట్టా బుద్దుందా లేదా ఆడపిల్లవి అయి ఉండి అలా ఎలా మాట్లాడతావు అని ప్రశ్నిస్తాడు. పునర్నవి చిన్నప్పటి నుండి ఎప్పుడు మాట్లాడనిచ్చారు మీరు అని ప్రశ్నిస్తుంది. 
 
నలుగురిలో గట్టిగా మాట్లాడితే అమ్మాయివి గట్టిగా మాట్లాడకు అంటారు. పది నిమిషాలు ఫోనులో మాట్లాడితే ఎవరితో మాట్లాడుతుంది అంటారు. అమ్మాయి నలుగురు అబ్బాయిలతో మాట్లాడితే క్యారక్టర్ లెస్ అంటారు. అమ్మాయిలకు ఇచ్చిన గౌరవం ఇది అంటూ పునర్నవి చెబుతుంది. ఒక ఇంట్లో ఆడపిల్ల, మగపిల్లాడు పుడితే ఆడపిల్లను ఒకలాగా, మగపిల్లాడిని మరోలాగా ట్రీట్ చేస్తారు. అబ్బాయికి మంచి స్కూల్, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని చూస్తారు. అమ్మాయిలు చదువుకొంటానని ఎంతో రిక్వెస్ట్ చేస్తే తప్ప ఒప్పుకోరు. ఈరోజు ఆడపిల్లలు మగవాళ్ళతో సమానంగా సంపాదిస్తున్నారని వితిక అంటుంది. స్కిట్లో వితిక, పునర్నవి అధ్బుతంగా నటించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: