ఒక సినిమా హిట్ అవ్వాలంటే ముఖ్యంగా ఉండాల్సింది ఆడియెన్స్ ను సీట్లలో కూర్చేబెట్టే కథ. కంటెంట్ బాగుంటేనే సినిమా ఆడుద్ది. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఒప్పుకోవాల్సిన నిజం. కాని కొన్ని సినిమాలు క్రేజ్ మీద ఆడేస్తాయి. మరికొన్ని కాంబినేషన్ మీద ఆడుతాయి. ఇంకా లక్ బాగుంటే కొన్ని సినిమాలు కథ రొటీన్ గా ఉన్నా ఎంటర్టైన్ అయితే చాలు సినిమా హిట్ అయినట్టే.


ఇలా సినిమా కథల్లో రకరకాలు ఉన్నాయి. ఫైనల్ గా కావాల్సింది మాత్రం ఆడియెన్స్ ను మెప్పించేలా చేయడమే. ఇదిలాఉంటే ఈమధ్య తెలుగు సినిమాలను చూస్తే అనూహ్యమైన మార్పు వచ్చిందని చెప్పొచ్చు. చిన్న హీరో దగ్గర నుండి స్టార్ హీరోల వరకు కంటెంట్ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు. రొటీన్ సినిమాలు చూసి ఆడియెన్స్ కు మాత్రమే కాదు రొటీన్ సినిమాలు చేసి హీరోలకు బోర్ కొట్టిందనుకుంటా అందుకే హీరోలు కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటేనే సినిమా అనేస్తున్నారు. 


అయితే ఈ క్రమంలో యువ హీరోలు ఎక్కువ ప్రయోగాలు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. రీసెంట్ గా యువ హీరోల్లో విజయ్ దేవరకొండ, అడివి శేష్ ఇద్దరు మంచి ఫాం లో దూసుకెళ్తున్నారు. పెళ్లిచూపులు సినిమాతో హీరోగా సూపర్ హిట్ కొట్టిన విజయ్ ఆ తర్వాత అర్జున్ రెడ్డి అని అదిరిపోయే హిట్ అందుకున్నాడు. సినిమా సినిమాకు పాత్రలు.. క్యారక్టరైజేషన్ ఇలా అన్నిటిలో చాలా డిఫరెన్స్ చూపిస్తున్నారు. ఇక అదే దారిలో అడివి శేష్ కూడా.. సొంత కథలతో సూపర్ హిట్ కొడుతున్నాడు.


క్షణం, గూఢచారి సినిమాలు హిట్ అవగా రీసెంట్ గా వచ్చిన ఎవరు కూడా హిట్ టాక్ సొంతం చేసుకుది. తీసే సినిమా మీద నూటికి నూరు శాతం కష్టపడి ప్రేక్షకుల మెప్పు పొందడమే వీరు చేసే పని. చూస్తుంటే తెలుగు సినిమా దశ దిశ మార్చే వారిలో ఈ ఇద్దరు హీరోల పేర్లు బాగా వినిపిస్తుంది. రొటీన్ కు భిన్నంగా కొత్త ప్రయోగాలతో ఈ హీరోల సినిమాలు ఉన్నాయి. తప్పకుండా తెలుగు సినిమా ఇంకా ఎన్నో ప్రయోగాలు చేసి మరెన్నో అద్భుతాలు సృష్టించాలని ఆశిద్దాం. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: