మణీందర్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తూ హీరోగా నటిస్తున్నచిత్రం `అమ్మాయి ప్రేమలోపడితే`. సోనాక్షి వర్మ హీరోయిన్‌. హర్షవర్ధన్‌, రమేష్‌ నిర్మాతలు. ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకుంది. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా...


హీరో దర్శకుడు మణీందర్‌ మాట్లాడుతూ ``స్వచ్చమైన ప్రేమకథలకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుంటారు. అందుకు మనకు చాలా ఉదాహరణలున్నాయి. అలాంటి ఓ సచ్ఛమైన ప్రేమకథగా మా చిత్రం `అమ్మాయి ప్రేమలో పడితే` తెరకెక్కుతోంది. మంచి లవ్ అండ్ ఎమోషన్ ఎలిమెంట్స్ రూపొందుతోన్న మా చిత్రం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే ఆడియో, సినిమా విడుదల తేదీలను ప్రకటిస్తాం`` అన్నారు. 
ఇకపోతే ఒక ద‌ర్శ‌కుడే న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం అంటే అది మామూలు విష‌యం కాదు. అందులో ఇదొక ప్రేమ‌క‌థా చిత్రంగా తెర‌కెక్కుతోంది. మ‌రి ఇది ప్రేక్ష‌కుల మెప్పు ఎంత వ‌ర‌కు పొందుతుందో వేచి చూడాలి. గ‌తంలో ఇలా చేసిన చిత్రాల్లో కొన్ని హ‌ట్లు ఉంటే మ‌రికొన్ని ఫ్లాపులు కూడా ఉన్నాయి. మ‌రి ఇది ఏ కోవ‌కు చెందుతుందో వేచి చూడాలి. వాటిలో ఎక్కువ‌గా లారెన్స్‌, ప్ర‌భుదేవా చాలా వ‌ర‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించి హీరోగా న‌టించిన చిత్రాలు ఉన్నాయి. ఒక సీనియ‌ర్ హీరోల విష‌యానికి వ‌స్తే న‌ట‌సార్వ‌భైముడు ఎన్టీరామారావు దాన‌వీర‌సూర‌క‌ర్ణ ఇలా కొన్ని చిత్రాలు చేశారు. ఇటీవ‌లె వ‌చ్చే కొత్త‌గా వ‌చ్చే హీరోలు కూడా కొంత మంది ఈ ఫ్మార్ములాని పాటిస్తున్నారు. ఇటు ద‌ర్శ‌క‌త్వం అటు న‌ట‌నా రెండూ చేస్తూ రెండు విధాలా వారి టాలెంట్‌ని బ‌య‌ట‌పెడుతున్నారు. ఇక మ‌రి ఈ ద‌ర్శ‌కుడు ఏ విధంగా స‌క్సెస్‌ను సాధిస్తాడో నటుడిగానా లేక ద‌ర్శ‌కుడిగా అన్న‌ది తెర‌మీద చూడాలి.


మణీందర్, సోనాక్షి వర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రానికి దర్శకత్వం: మణీందర్, నిర్మాతలు: హర్షవర్ధన్, రమేశ్, మ్యూజిక్: చిన్నికృష్ణ, ఎడిటర్: నవనీత్, రచన: బండోజి, డాన్స్: ప్రసాద్, ఫైట్స్: రవి.


మరింత సమాచారం తెలుసుకోండి: