ఈ ఏడాది ప్రారంభంలో  ఎఫ్ 2 తో  బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'వాల్మీకి'.  ఈ చిత్రం యొక్క టీజర్ నిన్న విడుదలై  ఇప్పటివరకు రెండు మిలియన్లకు  పైగా  వ్యూస్ ను రాబట్టుకొని మంచి రెస్పాన్స్  ను తెచ్చుకుంటుంది.  ఇక  ఇప్పటివరకు లవర్ బాయ్ గా  అలరించిన  వరుణ్ ను  ఈ సినిమాలో పక్క మాస్ అవతారంలో చూపిస్తున్నాడు డైరెక్టర్ హరీష్ శంకర్.  కాగా టీజర్ లో వరుణ్ లుక్ ఫై   ప్రశంసలు కురిపిస్తున్నారు సినీ ప్రముఖులు. వరుణ్ తేజ్ మేకోవర్ అద్భుతమని సినిమాలో పాత్ర కు తగ్గట్లు అచ్చం రౌడీ లానే వున్నాడని పొగుడుతున్నారు. మొత్తానికి వరుణ్ తన లుక్ తో సినిమాఫై అంచనాలను పెంచేశాడు.  అలాగే ఈసినిమాతో వరుణ్ తేజ్ కు మాస్ లో ఫాలోయింగ్ రావడం కూడా పక్కాగా కనిపిస్తుంది. 


కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'జిగర్తండా' కు  రీమేక్ గా తెరకెక్కుతున్న ఈచిత్రంలో  బాబీ సింహ పాత్రలో  వరుణ్ తేజ్ నటిస్తుండగా  సిద్దార్థ్ పాత్రలో తమిళ  యువ  హీరో అథర్వ మురళి కనిపించనున్నాడు.   అతనికి  తెలుగులో ఇదే మొదటి సినిమా.  కాగా అతని ప్రియురాలుగా   ఈచిత్రంలో మృణాళిని రవి  నటిస్తుండగా  పూజా హెగ్డే మరో  కథానాయికగా  నటిస్తుంది. అయితే నిజానికి ఒరిజినల్ వెర్షన్ లో  పూజా హెగ్డే పాత్ర లేదు. మరి ఈ సినిమాలో  ఎందుకు పెడుతున్నారో తెలియాల్సి వుంది.   ఇక వీరితోపాటు హాట్ బ్యూటీ డింపుల్ హయాతి స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. 14 రీల్స్ ప్లస్  బ్యానర్ ఫై  రామ్ ఆచంట , గోపీచంద్ ఆచంట  నిర్మిస్తున్న ఈచిత్రానికి  మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.   ఈ చిత్రం సెప్టెంబర్ 13న  విడుదలకానుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: